ఆంధ్రకు మరో రెండు పతకాలు

Two more medals for Andhra– 38వ జాతీయ క్రీడలు
డెహ్రడూన్‌: 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు మరో రెండు పతకాలు దక్కాయి. 7వ రోజు పురుషుల డబుల్స్‌ బ్యాడ్మింటన్‌, కనో స్లాలోమ్‌లో ఆంధ్రకు కాంస్య పతకాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో గౌస్‌-సాయి పవన్‌ జోడీ, మహిళల కనో స్లాలోమ్‌ కేటగిరీలో డి. చేతన భగవతి కాంస్య పతకాలను చేజిక్కించుకున్నారు. ఈ పతకాలను అథ్లెట్లకు ఇంకా అందజేయని కారణంగా పట్టికలో చూపలేదు. 7వ రోజు పోటీలు ముగిసే సరికి పతకాల పరంగా కర్ణాటక అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ఏడో రోజైన మంగళవారం పోటీలు ముగిసే సరికి కర్ణాటక 42పతకాలతో మరోసారి టాప్‌లోకి ఎగబాకింది. ఇందులో 22స్వర్ణాలు, 10రజత పతకాలతో సహా మరో 10 కాంస్యాలున్నాయి. రెండోస్థానంలో సర్వీసెస్‌కు 38 పతకాలు దక్కినా..జిందులో 19 స్వర్ణాలు మాత్రమే ఉన్నాయి. ఇక పతకాల పరంగా 61పతకాలు సాధించిన మహారాష్ట్రకు కేవలం 15 స్వర్ణాలే దక్కడంతో ఆ జట్టు మూడోస్థానంలో కొనసాగుతోంది.