నేడే మరో రెండు పథకాలు అమలు

– టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ – శంకరపట్నం
వంద రోజులలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను ఇప్పటికే రెండు పథకాలను అమలు చేసి మరో రెండు పథకాలను మంగళవారం ప్రియాంక గాంధీ చేతుల మీదుగా అమలు చేయనున్నట్లు, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ తెలిపారు.. సోమవారం శంకరపట్నం మండల కేంద్రంలో  కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ,ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పథకం అమలు చేశామని తెలిపారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే గ్యాస్ సిలిండర్ పథకం ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మంగళవారం అమలు చేయనున్నట్లు,ఆయన పేర్కొన్నారు. మహిళలకు 2500, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు జరగనున్నట్లు, తెలిపారు. రెండు లక్షల రైతు రుణమాఫీ పై ఆర్బిఐ అధికారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారని తెలిపారు. మండలంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఎమ్మెల్యే మంత్రుల దృష్టికి తీసుకుపోతామని స్పష్టం చేశారు ప్రజలను ఇబ్బందులకు గురి చేసే అధికారులకు స్థానచలనం తప్పదని హెచ్చరించారు. దశలవారీగా అన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బసవయ్య, హిసముద్దీన్,  మూలంగూరి సదానందం ,చంద్రమౌళి, మాజీ సర్పంచులు గట్టు తిరుపతి గౌడ్, రాజ కొమురయ్య, సంపత్ , రాజిరెడ్డి, నాయకులు శ్రీనివాస్, ప్రవీణ్  శ్రీకాంత్ తదితరులు  పాల్గొన్నారు.