– పండుగ సీజన్‌లో 35 శాతం డిస్కౌంట్లు
– సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేవ్ సర్కార్ వెల్లడి
నవతెలంగాణ- బిజినెస్ బ్యూరో
ప్రముఖ ఫర్నీచర్ ఉత్పత్తుల బ్రాండ్ గోద్రేజ్ ఇంటీరియో రిటైల్ నెట్‌వర్క్‌లో భారీ విస్తరణపై దృష్టి పెట్టింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేవ్ సర్కార్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రతీ వారంలో రెండు చొప్పున కొత్తగా 104 అవుట్‌లెట్లు తెరువాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వచ్చే మూడేండ్లలో 25 కొత్త షోరూంలు, 150 రిటైల్ అవుట్‌లెట్‌లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో తమకు 250 పైగా ఛానల్ భాగస్వాములు ఉన్నారన్నారు. దేశ వ్యాప్తంగా 600 పైగా నగరాల్లో తమకు 900 పైగా అవుట్‌లెట్‌లు ఉన్నాయన్నారు. గతేడాది రూ.3200 కోట్ల టర్నోవర్‌ను సాధించామన్నారు. ప్రస్తుత పండుగ సీజన్‌లో తమ ఉత్పత్తులపై 35 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తామన్నారు. వచ్చే మూడేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో 25 అవుట్‌లెట్‌లు తెరువాలని నిర్దేశించుకున్నామన్నారు. ఫర్నీచర్ మార్కెట్ రూ.1.40 లక్షల కోట్లుగా ఉందని.. ఇందులో సంఘటిత మార్కెట్ విలువ రూ.8000 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు.