నవతెలంగాణ పెద్దపల్లి:రాష్ట్రంలో కొత్తగా రెండు ఆర్టీసీ డిపోలు మంజూరయ్యాయి. పెద్దపల్లి, ములుగు జిల్లా ఏటూరునాగారంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. కొత్త డిపోల మంజూరు సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. 10-15 ఏండ్ల తర్వాత రెండు నూతన ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. కొన్నేళ్లుగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో తీసుకుపోతున్నట్లు చెప్పారు. కొత్త డిపోల ద్వారా ఆ ప్రాంత వాసులకు, మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రయాణికులకు మేలు జరుగుతుందని చెప్పారు.