
నవతెలంగాణ – అశ్వారావుపేట
నూతనంగా ఏర్పాటైన పంచాయితీ లకు,గతం లో ఏర్పడినా పంచాయితీలకు భవనాలు లేని పంచాయితీలకు గత ప్రభుత్వం హయాం లోనే భవనాలు మంజూరు చేసారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో 30 పంచాయితీలకు గాను 17 పంచాయితీ లకు భవనాలు మంజూరు చేసారు.ఇందులో పంచాయితీ రాజ్ శాఖ ఆద్వర్యం లో 9,ట్రైబల్ వెల్ఫేర్ ఆద్వర్యంలో 8 భవనాలు ఒక్కో దానికి రూ.20 లక్షలు వ్యయంతో నిర్మిస్తున్నారు. అయితే నేటికి పంచాయితీ రాజ్ శాఖ ఆద్వర్యం లో నిర్మించే వి 2 మాత్రమే పూర్తి కావడంతో మంగళవారం రెవెన్యూ శాఖ మంత్రి ప్రారంభించనున్నారు. మిగతా వాటికి మోక్షం ఎపుడో అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే ట్రైబల్ వెల్ఫేర్ ఆద్వర్యంలో నిర్మించే వి ఒక్కటీ నేటి వరకు పూర్తికాలేదు.అయితే ఈ పంచాయితీ భవనాలు నిర్మాణానికి నిధులు కొరత వేధిస్తుంది అని తెలియవచ్చింది.