మేడారం మహా జాతరలో తీవ్ర విషాదం.. ఇద్దరు మృతి

నవతెలంగాణ – తాడ్వాయి
మేడారం మహా జాతరలో  తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరుకు చెందిన చింతల కొమురయ్య (68) సంవత్సరాలు గురువారం జాతరకు వచ్చారు. దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అంతలోనే గుండెపోటు రావడంతో అక్కడే ఉప్పకూలిపోయాడు. పుట్ట హుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పుడే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మరోవైపు జంపన్న వాగులో స్నానం చేస్తూ మరొక వ్యక్తి గల్లంతయ్యారు. కామారెడ్డి జిల్లాకు చెందిన సాయిలు అనే వ్యక్తి వాగులో స్నానం చేస్తూ గల్లంతై మరణించినట్లు సమాచారం. అయితే ఒకేరోజు ఇద్దరూ జాతరలో మృతి చెందడం తో విషాదఛాయలనుకున్నాయి. అధికారులు పోలీసులు భక్తులను హెచ్చరించారు. వాగులో స్నానం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.