నవతెలంగాణ- తాడ్వాయి : మోటార్ సైకిల్ తప్పి అడవిలోకి దూసుకెళ్లిన సంఘటన లో ఇద్దరు మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న హృదయ విధారకమైన సంఘటన తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక కు చెందిన పోతుగంటి వంశీ(23), ఎల్తూరి పవన్(22)లు అక్కడికక్కడే మృతి చెందారు. మామిడి భాస్కర్ తీవ్ర గాయాల పాలై వైద్యం పొందుతున్నాడు. వీరు మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయానికి పెయింట్ వేయడానికి వచ్చి, వ్యక్తిగత అవసరాల నిమిత్తం కాటాపూర్ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో నాంపల్లి బంజారా వద్ద గల మూలమలుపు వద్ద బైకు అదుపుతప్పి అడవిలోకి దూసుకెళ్లి చెట్టుకు ఢీకొని అక్కడికి అక్కడికే మృతి చెందారు. తీవ్ర గాయాల పాలై అపస్థితిలో ఉన్న మామిడి భాస్కర్ ను 108 ద్వారా ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం పొందుతున్నాడు. కాగా అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఈ మేరకు తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.