రెండు భిన్న దృక్పథాలను ప్రజల ముందుం చుతూ 2024 సంవత్సరం ప్రారంభమైంది. మోడీ ప్రభుత్వం ప్రజలను సమస్యల పరిష్కారం కోసం అయోధ్య వైపు చూడాలంటున్నది. కార్మి క, కర్షక సంఘాలు శ్రామికులను పోరు బాట పట్టాలని పిలుపునిచ్చాయి. జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రధా నమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భిన్నమైన పని. మతపరమైన క్రతువును ప్రధాని ప్రభుత్వ కార్యక్రమంగా అమలు చేసారు. మతం వ్యక్తిగతం. కానీ ప్రధాని చర్య మతాన్నీ, ప్రభుత్వాన్నీ కలగాపులగం చేస్తున్నది. ప్రజల్లో గందరగోళం సృష్టిస్తు న్నది. మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ, కేంద్ర పాలకులు వాడు కుంటున్నారు. మత గురువులు, పీఠాధిపతులు చే యవల్సిన పని రాజకీయ నాయకులు, ప్రభుత్వాధి నేతలు చేయడం భారత రాజ్యాంగం పునాదులకే విరుద్ధం. మరోవైపు దేశంలో కార్మిక, రైతు, వ్యవ సాయ కార్మిక సంఘాలు ఫిబ్రవరి 16న ఐక్య పోరా టానికి పిలుపునిచ్చాయి. సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు వివిధ రంగాల్లో దేశవ్యాపిత సమ్మెకు పిలుపు నిచ్చాయి. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ బంద్‌కు పిలుపు నిచ్చాయి. సమస్యల పరిష్కారంలో విఫల మైన మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని శ్రామికులను కోరాయి. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఐక్యంగా పోరు బాట పట్టడం, రాజకీయ నినాదంతో కదం తొక్కడం గమనార్హం. రాజ్యాంగానికి అధిపతి గా ఉన్న రాష్ట్రపతి నోట కూడా కేంద్ర ప్రభు త్వం హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాల గురించీ, భక్తుల సందర్శన గురించీ పలికించింది. మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగపాఠమే కదా రాష్ట్రపతి చదివేది! కానీ నూతన పార్ల మెంట్ భవనం ప్రారంభం సందర్భంగా మా త్రం రాష్ట్రపతిని ఆహ్వానించలేదు. ఇప్పుడు రాష్ట్ర పతి నోట రాజ్యాంగ విరుద్ధమైన మాటలు పలికించింది మోడీ ప్రభుత్వం. కేంద్ర బడ్జెట్‌లో ఈ విషయాలు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రస్తావిం చారు. ‘స్పిరిచ్యుయల్ టూరిజం’ గురించి ప్రత్యేకం గా చెప్పారు. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా రామాలయం నిర్మాణం ఐదువందల సంవత్సరాల కలగా ప్రస్తావించారు. పార్లమెంటులో ప్రధాని ప్ర సంగంలో ”రామాలయం ప్రారంభించడం తమ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం”గా ప్రస్తావిం చారు. ప్రభుత్వ, పార్లమెంట్ వ్యవహారాలతో మతా న్ని పూర్తిగా కలగాపులగం చేస్తున్నారు.
ఆయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవాన్ని రాను న్న ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. ఇం టింటికీ అక్షింతలు, ప్రతి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి అయోధ్యకు ఉచిత రైలు వాగ్దానం, ప్రధాని, కేంద్ర మంత్రులు రాముడి చిత్రంతో ము ద్రించిన పోస్టర్లు విస్తృతంగా అంటించడం ఇందులో భాగమే. రామాలయ ప్రారంభోత్సవ నిర్వాహకులు రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపారు. వామపక్ష పార్టీలు ప్రజల మతవిశ్వాసాలను గౌరవిస్తూనే, మత పరమైన క్రతువులకు రాజకీయ పార్టీలకు సంబం ధం ఉండకూడదని భావించాయి. ఈ సందర్భాన్ని బీజేపీ, తన రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవడాన్ని తప్పుబట్టాయి. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు, ‘ఇండి యా’ సమూహంలోని అనేక పార్టీలు కూడా హాజరుకా లేదు. ఇది సరైందే. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ లాంటి పార్టీల నాయకులు, కార్య కర్తలు కూడా అక్షింతల పంపకంలో పోటీపడ్డారు. మరోవైపు బీజేపీ పాలి త రాష్ట్రాల్లో, పార్లమెంట్ ఎన్నికలకు ముందే ‘ఉమ్మడిస్మృతి’ అమలుకు ప్రయత్నిస్తున్నారు.
మోడీ ప్రభుత్వం, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయ కులు చేస్తున్న ఈ ప్రయత్నాలతో ప్రజలు తమ నిజ మైన సమస్యలు మరచిపోవాలని వీరి కోరిక. ఇహ లోకంలో ఎదురవుతున్న బాధలు, కష్టాలన్నీ గత జన్మలో చేసుకున్న పాపం ఫలితాలుగా సర్దుకు పోవాలని వారి భావన. ఈ జన్మలో పెట్టుబడి దారు లకూ, భూస్వాములకూ, ధనిక రైతులకు, కాంట్రాక్ట ర్లకు, సేవలు చేసి, మరణానంతర స్వర్గ సుఖాల కో సం ఎదురుచూడాలని శ్రామికులకు వీరు ఇస్తున్న సందేశం. కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. కోరలు లేని నాలుగు ‘లేబర్ కోడ్స్’గా మార్చింది. ఇది పెట్టుబడిదారుల సేవలో కార్మికులు తరించడం కోసమనీ, శ్రమ దోపిడీకి పెట్టుబడిదారు లకు మార్గం సులభతరం చేయడం తమకోసమేనని కార్మికులు భావించాలన్న మాట! కుటుంబావస రాలకు సరిపడు వేతనాలు లేకపోయినా, విద్యుత్తు సవరణ బిల్లుతో విద్యుత్తు చార్జీలు పెంచినా, రైతు వ్యతిరేక చట్టాలు చేసేందుకు ప్రయత్నం చేసినా, వ్యవసాయ కార్మికుల గురించి ఏమి పట్టించుకోక పోయినా…. ఇవన్నీ పూర్వజన్మ ఫలితాలుగా సరి పెట్టుకోవాలట! మోడీ ప్రభుత్వ విధానాల ఫలి తంగా ధరలు పెరిగినా, ప్రజా పంపిణీ వ్యవస్థ నీరు గారిపోయినా, అటవీ హక్కుల చట్టాలను బలహీన పర్చి ఆదివాసీల జీవితాలతో చెలగాటమాడినా ప్రజ లు సర్దుకుపోవాలి. ఉద్యమాల మీద నిర్బంధం ప్ర యోగించినా, సామాజిక న్యాయం అమలు చేయక పోయినా, ‘ఈ జన్మకు మనకు ఇంతే రాసిపెట్టి ఉన్న ద’ని శ్రామికులు సరిపెట్టుకోవాలని మోడీ ప్రభు త్వం భావిస్తున్నది. అందుకే, తాను పరిష్కరించ వల్సిన సమస్యల మీద దృష్టి సారించకుండా, ప్రజల దృష్టిని రాముడివైపు, రామాలయం వైపు మరలి స్తున్నది. ఇంతమాత్రాన ప్రజలు తమను వేధిస్తున్న సమస్యలన్నీ మరచిపోతారని భావించడం వారి భ్రమ. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంట నే వైద్యులకు చూపిస్తారే గానీ, దేవుడి ముందు పెట్టి వేడుకోరుకదా! సమస్యలు పరిష్కరించేవారినీ, పరి ష్కారం కోసం ప్రజలకు సహాయం చేసేవారినీ, సమీకరించేవారినీ వదిలిపెట్టి దేవుడి మీదనే భారం వేయడం నిజ జీవితంలో ఎక్కడా జరగదు కదా! జనం దేవుడికి మొక్కులు, తాయత్తులకోసం వెతుకు లాడేది, మానవ ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడే! ఇక్కడ సమ స్యలు పరిష్కారం కానప్పుడే దేవుడివైపు చూస్తారు. అందుకే వామపక్షాల కార్యకర్తలు గానీ, శ్రామికుల సంఘాల నాయకులుగానీ ప్రజల సమ స్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. ప్రజలకు దగ్గరై, ప్రజలకు సాయపడుతున్నప్పుడు, ప్రజలు సహాయం పొందడానికే ఇష్టపడతారు. సహాయం చేసే వారి కోసం, తమను సంఘటితం చేసేవారి కో సం ఎదురుచూస్తారు. పాలకవర్గాలు దేశాన్ని ఆదా నీ, అంబానీలకు దోచిపెట్టడానికి బద్ధులై ఉన్నారు. అందుకే శ్రామికుల శ్రమదోపిడీకి అనువైన మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలు, భూ స్వాములు సులభంగా శ్రమను దోచుకోవడానికి అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. బడాబాబులు సుఖ సంతోషాలతో స్వర్గసుఖాలు అనుభ విస్తున్నారు. శ్రామికులు మాత్రం తమ కుటుంబం సుఖసంతోషాల కోసం ఈ జన్మలో ఓపిక పట్టాలని మతం పేరుతో, దేవుడి పేరుతో జోకొడుతున్నారు. మరోజన్మ ఉన్నదో లేదో బడాబాబులకు నమ్మకం లేదు. అందుకే, ఈ జన్మలోనే సకల సుఖాలూ అనుభవిస్తున్నారు. శ్రామి కులు మాత్రం మరో జన్మకోసం ఎదురు చూడాలట! పెట్టుబడిదా రులు, భూస్వాములు, కాంట్రాక్టర్లూ, బడా వ్యాపా రులూ బతికుండగానే సుఖప్రదమైన జీవితం గడప డానికీ, శ్రీమంతులుగా వెలిగిపోవడానికీ కష్టజీవుల జీవితాలు కొవ్వత్తుల్లాగా కరిగిపోవాలట! అది వారి తలరాతగా భావించాలట! శ్రామికులు కూడా, తాము బతికుండగానే, తమ కుటుంబాలు సుఖ ప్రదమైన జీవితం గడిపేందుకు కదలాలి. మరణా నంతర ‘స్వర్గసుఖాలు’ బతికుండగానే సాధించు కోవాలి. బడాబాబుల సేవలో తరించిపోతున్న కేంద్ర పాలకులు సహజంగానే శ్రామికుల సమస్యలు విస్మరించారు. అందుకే శ్రామికులకు సంఘటితంగా పోరాటం తప్ప మరో మార్గం లేదు.
పోరాటాలనుంచి ప్రజల దృష్టి మరల్చి, రాను న్న ఎన్నికల్లో లబ్దిపొందాలని మోడీ ప్రభుత్వం, బీజే పీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అందుకే ప్రజల దృష్టిని ఒకవైపు అధ్యాత్మిక చింతన, దైవ భక్తి, ఆయోధ్యవైపు మరలిస్తున్నారు. మరోవైపు ప్రజల మధ్య మత పరమైన విభజన సృష్టిస్తున్నారు. మైనారిటీలలో అభద్రతను పెంచుతున్నారు. ఎన్నిక లకు ముందే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ‘ఉమ్మడి స్మృతి’ అమలుకు ప్రయత్నించేది ఇందుకే. పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా ఎన్నికలకు ముందే అమలు చేస్తామని కేంద్ర మంత్రులు బరితెగించి ప్రకటిం చడం కూడా ఇందుకోసమే. ప్రజల దైవభక్తినీ, మత విశ్వాసాన్నీ శక్తివంతంగా తమ రాజకీయ ప్రయోజ నాల కోసం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు వాడుకుంటున్నారు.
వామపక్షాలు, కార్మిక, కర్షక సంఘాలు, అభ్యు దయవాదులు, సంస్థల ముందు ఇది పెద్ద సవాలు. సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు సహాయం చేసేవారు లేనప్పుడు మాత్రమే ప్రజలు దేవున్ని, మ తాన్ని ఆశ్రయించి ఊరటపొందుతారు. ప్రజా ఉద్య మం బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే మతోన్మాద శక్తుల కుయుక్తులు ఫలిస్తాయి. పోరాటశక్తి బలహీన పడినప్పుడే మతోన్మాదం బలపడుతుందికదా! ఐక్య పోరాటాలే మోడీ పాలకుల కుయుక్తులకు విరు గుడు. ఇప్పటికే ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల రైతాం గం మళ్లీ కదిలింది. ఇది శుభసూచికం. అది గమ నించిన కేంద్ర పాలకులు ఉద్యమంమీద ఉక్కుపాదం మోపుతున్నారు. అక్కడి రైతాంగం ఒంటరిగా లేదని గుర్తు చేయాలి. దేశవ్యాపితంగా స్పందించాలి. ఇదే నేటి తక్షణ కర్తవ్యం.
ఎస్. వీరయ్య