నవతెలంగాణ-పినపాక
మండలంలోని ఈ.బయ్యారం గ్రామంలో గుర్తుతెలియని దొంగలు రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లను ధ్వంసం చేశారు. పంట పొలాల్లో ఏర్పాటు చేసిన రెండు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌లను శనివారం గ్రామ శివారులోని ధ్వంసం చేసి అందులోని కాఫర్ వైర్‌ను చోరీ చేశారు. సమీపంలోని పంట పొదల్లో ట్రాన్స్‌ఫార్మర్ పరికరాలను పడేసి వెళ్లారు. సంఘటన స్థలాన్ని విద్యుత్ ఏఈ కావ్య పరిశీలించి, స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని తెలిపారు.