
భిక్కనూరు పట్టణంలోని సిద్ధ రామేశ్వర వైన్స్, రేణుక ఎల్లమ్మ ఆలయం సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు చోరీ కేసులో ఇద్దరు నిందితులను పట్టుకొని విచారించగా వారి వద్ద సిద్దిపేట పట్టణంలో మరో రెండు ద్విచక్ర వాహనాలు దొంగలించినట్లు ఒప్పుకున్నారు. నిందితుల వద్ద నుండి ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్సై సాయి కుమార్ తెలిపారు.