– పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరించిన ఈ ధరలు శుక్రవారం ఉదయం 6గంటల నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ తెలిపింది.
చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను దేశవ్యాప్తంగా సవరిస్తున్నట్టు సమాచారం ఇచ్చాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ శాఖ వెల్లడించింది. ఈ తగ్గింపు నిర్ణయం వినియోగదారులకు ఊరటనిస్తుందని, డీజిల్‌తో నడిచే 58 లక్షల గూడ్స్ వాహనాలు, ఆరు కోట్ల కార్లు, 27 కోట్ల ద్విచక్రవాహనాల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని పేర్కొంది.