హైదరాబాద్‌లో రెండు వేర్వేరు రోడ్డుప్రమాదాలు

హైదరాబాద్‌లో రెండు వేర్వేరు రోడ్డుప్రమాదాలు– నలుగురు మృతి…ఐదుగురికి గాయాలు
నవతెలంగాణ-హయత్‌నగర్‌
హైదరాబాద్‌లో రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. వనస్థలిపురం, ఎల్‌బీనగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా మల్లెపల్లికి చెందిన ఇస్లావత్‌ ధస్ర శనివారం తెల్లవారుజామున టీఎస్‌ 05ఈ సీ 0123 నెంబర్‌ గల కారులో బీఎన్‌ రెడ్డి నుండి తుర్కయాంజల్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో సాగర్‌ హైవేపై గుర్రంగూడ వద్ద ఉన్న విపాసన ధ్యానకేంద్రం దగ్గర యూటర్న్‌ తీసుకుంటున్న సమయంలో డివైడర్‌ ఢకొీనడంతో కారు పల్టీలు కొట్టి అవతలి రోడ్డు మీద పడింది. అదే సమయంలో తుర్కయాంజల్‌ నుంచి బీఎన్‌ రెడ్డి వైపు వస్తున్న టీఎస్‌ 22టీ ఏ 0898గల కారు పల్టీలు కొట్టిన కారును ఢకొీట్టింది. దాంతో కారులో ఉన్న జగిత్యాల జిల్లాకు చెందిన బొల్లం ప్రణరు కుమార్‌(29), ప్రకాశం జిల్లాకు చెందిన కుంచాల రవీందర్‌ బాబు(30) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అలాగే ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హాయత్‌నగర్‌ నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు హాయత్‌ నగర్‌ నివాసి సుంకర మొగ్గయ్య(60), సడే వీరయ్య(49) క్యాబ్‌లో వెళ్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం పక్కనే ఉన్న ప్రభుత్వ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢకొీట్టడంతో సుంకర మొగ్గయ్య, సడే వీరయ్య అక్కడికక్కడే చనిపోయారు. క్యాబ్‌ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాల య్యాయి. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుక్కల దాడిలో చిన్నారి మృతి
అదేవిధంగా జీడిమిట్ల డివిజన్‌లోని గాయత్రినగర్‌లో దీపాలి(2) అనే చిన్నారిపై కుక్కలు దాడి చేయడంతో..ఆ పాప మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.