నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలంలోని ఆదర్శ పాఠశాల, నీల జిల్లా పరిషత్ పాఠశాల పరీక్ష కేంద్రంలో శనివారం నాడు జరిగిన పరీక్షకు ఇద్దరు విద్యార్థులు గైరాజరైనట్లు ఎంఈఓ గణేష్ రావు తెలిపారు. పరీక్ష ప్రారంభం నుంచి దూపల్లి జిల్లా పరిషత్ పాఠశాల నుంచి ఒక అమ్మాయి డేంగితో బాధపడుతూ పరీక్షలకు గైరాజరవుతూ ఉండగా, ఈరోజు నీలా జిల్లా పరిషత్ పాఠశాల పరీక్ష కేంద్రంలో ఒక అమ్మాయి పరీక్షకు వేరాజరయ్యిందని ఆయన పేర్కొన్నాడు. తెలుగు పరీక్ష రోజున అమ్మాయి తండ్రి మృతి చెందగా, తెలుగు హిందీ ఇంగ్లీష్ పరీక్షలను రాసిన ఆమె ఈరోజు పరీక్షలకు గైరాజరయిందని ఆయన తెలిపారు. కుటుంబీకులు ఆమెను నిద్ర కు తీసుకెళ్లి ఉంటారని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.