బాసర ట్రిపుల్ ఐటీ కి ఇద్దరు విద్యార్థుల ఎంపిక..

నవతెలంగాణ- రాజంపేట్
మండలంలోని తలమడ్ల ఉన్నత పాఠశాల కు చెందిన ఇద్దరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీ కి ఎంపిక అయ్యారని సోమవారం ప్రధానోపాధ్యాయులు అంజలి రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…రంగ వైష్ణవి (10GPA) మరియు ర్యావ కుమార్ (9.7GPA) లు ఎంపికైనట్లు ఆయన తెలిపారు.  వీరి ఎంపిక పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ విద్యార్థులను సర్పంచ్ యాదవరెడ్డి, ఎంపీటీసీ రాజు,  ఎస్ఎంసి చైర్మన్ స్వామి, ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గార్లు అభినందించారు.