
– తొర్రూరు సిఐ జగదీష్
నవతెలంగాణ-నెల్లికుదురు : నెల్లికుదుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను నెల్లికుదురు ఎస్.ఐ రమేష్ బాబు తమ పోలీస్ సిబ్బందితో కలిసి పట్టుకొని నిందితులను అరెస్టు చేసినట్లు తోరూర్ సీఐ జగదీష్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఉదయం సమయం 12.00 గంటలకు నమ్మదగిన సమాచారం మేరకు మహబూబాబాద్ నుండి నెల్లికుదుర్ కు వసతున్న ఆటొ లొ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులు బాబులు మరియు రతన్ బాడీ లు అనే ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అని తెలిపారు.వారి వద్ద నుండి 1,58,250 రూపాయలు వలువ గల 6.33 కేజీల ిషేదిత గంజాయిని స్వాదినం చేసుకోని .నిందితులను రిమాండ్ కొరకు కోర్ట్ ముందు హాజరు పరచడం జరిగింది అని అన్నాడు ఇట్టి కేసులో నిందితులను పట్టుకున్న నెల్లికుదురు ఎస్.ఐ రమేష్ బాబు మరియు సిబ్బందిని మహబబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అభినందించినట్లు తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడితే సహించేది లేదని అన్నారు.