
నవతెలంగాణ – నెల్లికుదురు
ఆక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం పరుచుకొని ఒక బైక్ ను సీజ్ చేసినట్లు తొర్రూర్ సిఐ జగదీష్ తెలిపారు మండల కేంద్రంలోని తొర్రూర్ కేసముద్రం వెళ్లే క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న నెల్లికుదురు ఎస్ఐ చిరా రమేష్ బాబు శనివారం పట్టుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లికుదుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనం పై గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను నెల్లికుదురు ఎస్.ఐ రమేష్ బాబు తన సిబ్బందితో కలిసి పట్టుకోవడం జరిగింది తెలిపాడు. శనివారం ఉదయం సమయం 09.00 గంటలకు నమ్మదగిన సమాచారం మేరకు మహబూబాబాద్ నుండి నెల్లికుదుర్ మీదుగా తొర్రుర్ వైపు ద్విచక్ర వాహనం లోని సీటు కింద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నరేంద్ర కిల్లా, బాపన్ రాయ్ అనే ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది.వారి వద్ద నుండి రూ.1,26,750/- రూపాయలు విలువ గల 5.కేజీ 070 గ్రాముల నిషేదిత గంజాయిని స్వాదినం చేసుకోని బైక్ సీజ్ చేసి నిందితులను రిమాండ్ కొరకు కోర్ట్ ముందు హాజరు అర్జునుడు తెలిపారు. నిందితులను పట్టుకున్న నెల్లికుదురు ఎస్.ఐ రమేష్ బాబు మరియు సిబ్బందిని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అభినందించినట్లు తెలిపారు ఆక్రమంగా గంజాయిని నల్ల బెల్లం పట్టికను రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు తెలిపారు నిబంధనలను అతిక్రమించి ప్రవర్తిస్తే ఎంతటి వారిపై నైనా చట్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు చట్టం ముందు అందరూ సమానులే అని తెలిపారు .