రెండు పూటలా ఉపాధి పనులు

– ఉదయం, సాయంత్రం వెళలో హాజరు
– ఆచరణలో సాధ్యమేనా.?
నవతెలంగాణ – మల్హర్ రావు
వేసవి తీవ్రత నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉపశమన చర్యలు చేపట్టాయి.కూలీలు వడదెబ్బకు గురికాకుండా పని వేళల్లో మార్పులు తీసుకొచ్చాయి.మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాదిహామీ పథకాన్ని కూలీలు కల్పతరువుగా మలుస్తుండగా తాజా నిర్ణయంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో కొత్త సంస్కరణలపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు వేసవి కారణంగా నిరంతరం పని చేస్తే ఎండ తీవ్రతకు గురైయ్యే అవకాశం ఉన్నందున రెండు పూటలా పని దినాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.ఉదయం పూట,సాయంత్రం వెళలో మొత్తం 5 గంటల పాటు పని చేసేలా సంస్కరణలు రూపొందించారు.
సాప్ట్ వేర్ లో పనుల క్రోడీకరణ: మండలంలో మొత్తం 15 గ్రామలున్నాయి.8,441, ఇందులో కూలీల సంఖ్య 18,752 కాగా కూలి కుటుంబాలు 4,178 ఉన్నాయి.దీనికి గాను రోజుకు సగటున 11,079 పైగా కూలీలు హజరౌవుతున్నారు.ఎన్ఎంఎంఏస్ యాప్ ద్వారా పనిచేసే కూలీల సంఖ్యతో పాటు చిత్రాన్ని సెల్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో పొందపరుస్తుండగాఉన్నతాధికారులకు పర్యవేక్షణ సులువుగా అవుతుంది. పనితీరుకు సంబంధించిన ఫొటోలను అప్లోడ్ చేయడం పథకం పారదర్శకంగా ఉండేలా సాప్ట్ వేర్ లో మార్పులు తెచ్చారు.
పని వేళల్లో మార్పులు ఆచరణలో సాధ్యమైయ్యేనా: కేంద్రం ఉత్తర్వుల నేపథ్యంలో జాబ్ కార్డులు ఉన్న కూలీల కుటుంబాలు ఉదయం 6 నుంచి 11 వరకు, సాయంత్రం 4 గంటల నుంచీ పనులకు హాజరు కావాలి.మధ్యాహ్నం విరామం ఇచ్చారు. పని వద్ద పర్యవేక్షణ చేస్తున్న మెటీలు వారికి కేటాయించిన కోడ్ ఆధారంగా ఉదయం,మధ్యాహ్నం వెళలో ఎంతమంది వచ్చారనేది రెండు సార్లు కూలీల పేర్లను మాస్టర్ లో నమోదు చేయాలి.ఫొటోలు సైతం రెండుసార్లు తీయాలి.గ్రామాల్లో దూర ప్రాంతాలకు వెళ్లి పని చేసేవారికి మధ్యాహ్నం విరామం సమయంలో ఇంటికెళ్ళేందుకు అవకాశం ఉండదు.దగ్గరలో పనిచేసేవారికి వెసులుబాటు ఉంటుంది.అయితే రెండు పూటలా పనులు చేయలేమని కూలీలు వాపోతున్నారు.వ్యక్తిగత శుభ్రతతో ఇక్కట్లు పడతామని, పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలని తప్పా రెండు పూటలా పని చేయడమంటే అసాధ్యం అంటున్నారు.మస్టర్ రెండుసార్లు హాజరు నమోదు కూడా ఇబ్బందితో కూడుకున్న పనని ఉపాదిహామీ సిబ్బంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో అవగాహన:
మండలంలో ఉపాదిహామీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన కల్పిస్తున్నారు.ఉపాది పథకంలో కొత్తగా వచ్చిన సంస్కరణ ఆధారంగా పనులను పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు.ప్రస్తుతం అవగాహన కల్పిస్తుండగా ఆచరణలో రెండు మూడు వారాల్లో తప్పకుండా అమలు అవుతుందని అధికారులు చెబుతున్నారు.పని వెళలో మార్పు అనేది కూలీల రక్షణ కోసమేనని అధికారులు చెబుతున్నారు.కానీ మహిళ కూలీలు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు పడుతామని వాపోతున్నారు.
మండలంలో ఇలా..
మండలంలో గ్రామాలు…15
జాబ్ కార్డులున్న కుటుంబాలు..8,441
కూలీల సంఖ్య…18,752
మహిళ కూలీల సంఖ్య…7,896
వంద రోజులు పని చేసిన కుటుంబాలు….33
రోజువారీ కూలి…రూ.300