ద్విచక్రవాహనం అదుపు తప్పి వ్యక్తికి గాయాలు..

– సిద్దిపేట్ ఏరియా ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ-దుబ్బాకరూరల్
ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు ,108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లపూర్ వార్డుకి చెందిన కొండే సుమంత్(25) గంభీర్పూర్ లో వారి బంధువుల ఇంట్లో జరుగుతున్న దావత్ కి హాజరై తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో చికోడు నుండి దుబ్బాక కు వస్తుండగా (పాత యేల్లమ్మ టెంపుల్ దాటిన తర్వాత) బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడింది. దీంతో సుమంత్ తలకు తీవ్ర గాయమైంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు 108,పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి దుబ్బాక పోలీసు సిబ్బంది వివరాలు నమోదు చేసుకున్నారు.చికిత్స కోసం క్షతగాత్రుడిని తొలుత దుబ్బాక ఏరియా ఆసుపత్రి తరలించగా… తదుపరి మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.సంఘటన స్థలంలో పోలీస్ సిబ్బంది భిక్షపతి ,108 ఈఎంటీ ఎల్లప్ప, ఫైలెట్ కనకరాజు ఉన్నారు.మరోవైపు ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని దుబ్బాక పోలీసులు తెలిపారు.