-108 సాయంతో ఆసుపత్రి తరలింపు
నవతెలంగాణ మిరుదొడ్డి: ద్విచక్ర వాహనం అదుపు తప్పి దంపతులకు తీవ్ర గాయాలైన ఘటన మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక మండలం తిమ్మాపురం నుంచి మెదక్ జిల్లా రామాయంపేట కు వెళ్తున్నద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్నటువంటి డ్రైనేజీలో పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వాహనదారుడికి తీవ్ర గాయాలు కావడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి108 వాహనంలో చికిత్స నిమిత్తం తరలించారు.