వేర్వేరు ఘటనలో ఇద్దరు యువకులు మృతి.. 

Two youths died in separate incidents.నవతెలంగాణ – తాడ్వాయి 
వేర్వేరు ఘటనలో పులిమాదిరి క్రాంతి (25), పిల్లి కుమార్ (35) అనే ఇద్దరు మృతి చెందారు. ప్రేమ వ్యవహారం విఫలమై పులిమాదిరి క్రాంతి అనే యువకుడు ఉరి వేసుకుని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా,  ఎదురు ఎదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని పిల్లి కుమార్ (35) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి చెందిన పులిమాదరి సమ్మయ్య కుమారుడు పులిమాదిరి క్రాంతి గత ఆరు సంవత్సరాల నుండి పాల్వంచ పట్టణానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలిసింది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఆ అమ్మాయితో మాట్లాడినట్టు తెలిసింది. ఆమె ప్రేమ వ్యవహారం నిరాకరించినట్లుగా ఫోన్లో మాట్లాడినదని సుమారు 10.20 నిమిషాలకు ఆయన సొంత ఇంట్లో ఉరేసుకొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. క్రాంతి మృతదేహాన్ని శివ పరీక్షలు నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి దుర్మరణం 
కాల్వపల్లి గ్రామానికి చెందిన పిల్లి కుమార్ (35) కాల్వపల్లి నుండి భూపాల్ పల్లి వెళ్లే ఆర్టీసీ బస్సు వెళ్లిపోయింది. ఆ బస్సును ఎక్కియ్యడానికి ఒక మహిళను బైకుపై తీసుకుని వెళ్లాడు. సింగారం వద్దకు చేరుకొని బస్సు ఎక్కించి కాల్వపెళ్ళి గ్రామానికి తిరిగి వస్తున్న క్రమంలో స్తంభంపల్లి క్రాస్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొనడంతో పిల్లి కుమార్ తలకు బలమైన గాయాలతో అక్కడికక్కడే పడిపోయాడు. అతనిని 108 ద్వారా ములుగు తీసుకెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలిపారు. కాగా పిల్లి కుమార్ ఆటో డ్రైవర్గా విధులు నిర్వహిస్తుండేవాడు. కుటుంబ పరిస్థితులు బాగాలేక ఆటో అమ్ముకొని వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు భార్య భాగ్య ఉన్నారు. కాగా కాల్వపెల్లి అల్లం ఎల్లయ్య (80) వృద్ధుడు మృతి చెందాడు. దీంతో మండలంలో మేడారం, కాల్వపల్లి గ్రామాలలు శోకసముద్రంలో మునిగాయి.