
నవతెలంగాణ – మల్హర్ రావు
భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ అంబేద్కర్ సతీమణి మాత రమాబాయి అంబేద్కర్ 127 వ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఆల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 ఆధ్వర్యంలో నిమ్మనపల్లిలో ఘనంగా నిర్వహించారు.ముందుగా మాత రమాబాయి అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి, పూలతో ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు మాట్లాడారు సమాజ హితం కోసం త్యాగం చేసిన ఇంతటి గొప్ప త్యాగ మూర్తి జీవిత చరిత్ర గురించి భవిష్యత్తు తరాలు తెలుసు కోవడం ఎంతైనా అవసరం ఉందన్నారు.తన సంతానంలో నలుగురు పిల్లలకు వైద్యం చేయించు కోవడానికి డబ్బులు ఉన్న, ఆ డబ్బులను తన భర్త డాక్టర్ అంబేద్కర్ పరిక్షల ఫీజులు కట్టడానికి పంపించి, తన నలుగురు పిల్లలను చంపుకొని, డాక్టర్ అంబేద్కర్ గొప్ప చదువులు చదివించి, భారత రాజ్యాంగ నిర్మాణాన్ని అంబేద్కర్ ద్వారా తయారు చేసి,కోట్ల భారతీయుల బ్రతుకులు మార్చిన ఘనత, త్యాగం రమాబాయి అంబేద్కర్ కే దక్కుతుందని కొనియాడారు.ప్రాధానోపాధ్యాయురా లు వేముల జ్యోతి మాట్లాడుతూ మన కోసం మన దేశ ఉన్నతి కోసం తన కన్నా పిల్లల్ని పోగొట్టుకున్న మాతృమూర్తి రమాబాయి అంబేద్కర్.మాతృత్వానికీ నిలువెత్తు నిదర్శనం చదువుకు వెన్నుముక మాత రమాబాయిన్నారు.అనంతరం విద్యార్థులు చదువు కోవడానికి ,వీరి చరిత్ర తెలుసు కోవడం కోసం పాఠశాల గ్రంథాలయం కు మాత రమాబాయి అంబేద్కర్ జీవిత చరిత్ర గల విలువైన పుస్తకాన్ని పాఠశాల గ్రంధాలయానికీ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ 542 నిస్వార్థ సామాజిక సేవా కార్యకర్త లింగమల్ల శంకరయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థు లు పాల్గొన్నారు.