విద్య, వైద్యాన్ని డబ్బుతో బంధించడం నేరం

– పీపుల్‌ ప్రొటెక్షన్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సదానందరెడ్డి
నవతెలంగాణ-అడిక్‌మెట్‌
విద్య, వైద్యాన్ని డబ్బుతో బంధించడం నేరం అని పీపుల్‌ ప్రొటెక్షన్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సదానంద రెడ్డి అన్నారు. ప్రజలందరికీ విద్య, వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వ మే ఇవ్వాలని కోరుతూ నేడు పీపుల్స్‌ ప్రొటెక్షన్‌ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద నిరాహార దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే నిరాహార దీక్ష వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సదానంద రెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్యాలను కొందరు పాలకులు, అధికారులు తమ స్వలాభం, అవినీతి, లంచాల కారణంగా ప్రజలకు అందరిని ద్రాక్షగా మారిందన్నారు. ఓ పథకం ప్రకారం, వీటి స్థానంలో ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థ లను తీసుకొచ్చి ప్రజల శ్రమను, సంపదను దోచుకుంటూ, ప్రజల ఉసురు తీస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకు మాత్రం ప్రజల కోసం మేం ఇంత ఖర్చు చేసు ్తన్నాం, అంత ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారే కానీ, ప్రజలకు మేలు చేసిన పాపాన పోలేదన్నారు. ప్రైవేట్‌ కార్పొరేట్లకు సహాయ సహకారాలు అందిస్తూ, అందిన కాడికి దోచుకుం టున్నారన్నారు. దీని కారణంగా ప్రైవేట్‌, కార్పొరేట్లు మూడు పువ్వులు, ఆరు కాయలుగా దినదినాభివృద్ధి చెందు తూ ప్రజల శ్రమను, సంపదను నిర్వీఘ్నంగా కొల్లగొడుతు న్నారని తెలిపారు. ఈ విధమైన పరిస్థితుల నుంచి ప్రజలను గట్టెక్కించాలనే ఉద్దేశంతో పీపుల్‌ ప్రొటెక్షన్‌ పార్టీ నిరాహార దీక్ష చేపడుతుందనీ, ఈ దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉచిత విద్య వైద్య సాధన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు నారగోని ప్రవీణ్‌ కుమార్‌, పీపుల్స్‌ ప్రొటెక్షన్‌ పార్టీ హైదరాబాద్‌ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎం.ధనమ్మ, తదితరులు పాల్గొన్నారు.