యూసీసీ అనవసరం !

– లా కమిషన్‌కు ఐద్వా మెమోరాండం
యూసీసీ అవసరాన్ని పున:పరిశీలించాల న్న సాకుతో ఏకరూపత చట్టాలను, ప్రధానంగా మెజారిటీవాదుల చట్టాలను తీసు కురావడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అంతే కానీ మహిళలకు గణనీయంగా సమాన హక్కులు కల్పించే చట్టాలు తీసుకు వచ్చే ప్రయత్నాలు కాదివి. ఇంతకుముందు చెప్పినట్లుగా, ఏకరూపత చట్టం తీసుకువచ్చినంత మాత్ర మహిళలకు సమానత్వం రాదు. వాస్తవానికి, దీనివల్ల హిందూ చట్టాల నకలు ఏర్పడవచ్చు, అన్ని కమ్యూనిటీల్లో లింగ వివక్ష వుంటుంది.
న్యూఢిల్లీ : ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)కి సంబంధించి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఐద్వా) లా కమిషన్‌ సభ్య కార్యదర్శికి మెమోరాండం అందచేసింది. యుసిసి అవసరంపై మరోసారి అభిప్రాయాలు తెలియచేయాల్సిందిగా కోరుతూ గత నెల 14న లా కమిషన్‌ జారీ చేసిన పబ్లిక్‌ నోటీసును దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా కోటికిపైగా సభ్యత్వం కలిగిన ఐద్వా తరపున ఈ మెమోరాండాన్ని అందచేసినట్లు ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు పి.కె.శ్రీమతి, మరియం ధావలె, న్యాయ సలహాదారు కీర్తి సింగ్‌లు పేర్కొన్నారు.
అన్ని మతాలకు చెందిన కమ్యూనిటీల్లోనూ పితృస్వామ్య భావజాలంతో కూడిన, వివక్షాపూరితమైన పర్సనల్‌ చట్టాల భారంతో శతాబ్దాల తరబడి మన దేశంలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఏకరీతి (యూనిఫామ్‌) చట్టాలు తీసుకువచ్చినంత మాత్రాన మహిళలు సమాన హక్కులు పొందలేరని, అలాగే ఈ చట్టాల్లో వివిధ స్థాయిల్లో అంతర్లీనంగా వున్న వివక్షను రూపుమాపలేరని అందువల్ల యూసీసికి తాము అనుకూలం కాదని వారు పేర్కొన్నారు. అందువల్లే యూనిఫామిటీ (ఏకరూపత) అంటే సమానత్వం కాదు, మహిళలకు సమానత్వం, న్యాయంతో దీన్ని సరిపోల్చలేం. భారతదేశంలో ఈనాడు ఏకరూపత అన్నది అవసరమూ కాదు, వాంఛనీయం కాదని తాము అభిప్రాయపడుతున్నామని ఆ మెమోరాండంలో ఐద్వా నేతలు పేర్కొన్నారు.
గత 40ఏళ్ళుగా పర్సనల్‌ లాకి సంబంధించిన అనేక సమస్యలతో ఐద్వా పోరాడుతూ వచ్చింది. ప్రతి రాష్ట్రంలోనూ వివిధ లీగల్‌ సెల్స్‌లో మహిళల పర్సనల్‌ లా కేసులను ఎదుర్కొనడంలో క్రియాశీలంగా పనిచేస్తూ వచ్చాం. ప్రతి పర్సనల్‌ లా లోనూ సంస్కరణలు తీసుకురావడానికి, సమానత్వం తీసుకువచ్చేందుకు, వివక్షను రద్దు చేయడానికి ఐద్వా స్పష్టంగా, నిర్ద్వంద్వంగా కట్టుబడివుంది. ఉదాహరణకు, ఇతర సంస్కరణలతో పాటూ, హిందూ వారసత్వ చట్టంలో, క్రైస్తవులకు సంబంధించి భారత విడాకుల చట్టంలో సంస్కరణలు తీసుకురావడానికి చురుకుగా కృషి చేస్తోంది. అలాగే మూడుసార్లు తలాక్‌ చెప్పి విడాకులివ్వడానికి కూడా వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. వివిధ కమ్యూనిటీల సభ్యులతో ముఖ్యంగా ఈ కమ్యూనిటీలకు చెందిన మహిళలతో సంప్రదింపులు జరపడంతో పాటూ ఈ సంస్కరణల యత్నాలను కొనసాగించాం. పర్సనల్‌ చట్టాల్లో అంతరం వున్నపుడు లేదా మహిళలకు న్యాయం చేయడానికి ఇటువంటి చట్టాలు తీసుకురావాల్సిన అవసరమున్నపుడు ప్రతి కమ్యూనిటీలోనూ సంస్కరణలకు మద్దతిస్తూ, ఉమ్మడి చట్టాలు తీసుకురావడానికి రెండంచెల వ్యూహాన్ని ఐద్వా పాటిస్తోంది. ఆ రకంగా, వరకట్న చట్టాల్లో, బాల్య వివాహాల నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టంలో, గృహహింస నిరోధక చట్టంలో సంస్కరణలకు మద్దతిస్తూ వాటికోసం సాగిన పోరాటాల్లో ఐద్వా పాల్గొంది. ఇతర చట్టాలతో పాటూ నివాసం, నగదు నష్టపరిహార హక్కులను గృహ హింస నిరోధక చట్టం కూడా ఇస్తోంది.
యూసీసీపై 21వ లా కమిషన్‌ తన అభిప్రాయాలను విస్పష్టంగా వ్యక్తం చేసినా కూడా మళ్ళీ 22వ లా కమిషన్‌ ఈ అంశాన్ని పరిశీలించడం ఆశ్చర్యకరంగా వుందని మెమోరాండం పేర్కొంది. గణనీయమైన రీతిలో సమానత్వంతో పాటూ మహిళలకు ప్రాధమిక హక్కులతో పర్సనల్‌ లాని కలిపేందుకు యూసీసీ అవసరం కాదని లేదా వాంఛనీయం కూడా కాదన్న తమ అభిప్రాయాన్ని 2018లో 21వ లా కమిషన్‌ కూడా అంగీకరించిందని వారు ఆ మెమోరాండంలో పేర్కొన్నారు. ఈ అంశంపై 21వ లా కమిషన్‌ విస్తృతమైన సాక్ష్యాధారాలను తీసుకుంది. విస్తృత పరిశోధన చేపట్టింది. అనేక సెమినార్లలో, చర్చలు, సంప్రదింపుల్లో పాల్గొంది. ఆ తర్వాత యూసీసీకి సమయం ఆసన్నమవ లేదంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకు కారణాలు తెలిపింది. అవి ప్రస్తుతమున్న పర్స నల్‌ లాల్లో వివిధ అంశాలు మహిళలను కించపరుస్తు న్నాయి. ఇది వివక్ష అని, సమానత్వం మూలంలో వున్న తేడా కాదని కమిషన్‌ అభిప్రాయపడింది. ఈ అసమా నతను పరిష్కరించడానికి గానూ, ప్రస్తుతమున్న కుటుంబ చట్టాలకు కొన్ని సవరణలను కమిషన్‌ సూచించింది. ….ఈ దశలో అవసరం లేని, వాంఛనీయం కాని ఉమ్మడి పౌర స్మృతిని అందించడం కన్నా వివక్షతో కూడిన చట్టాలను ఈ కమిషన్‌ ఎదుర్కొంది. అనేక దేశాలు ఇప్పుడు తేడాను గుర్తించడం దిశగా పయనిస్తున్నాయి. కేవలం తేడా వున్నంత మాత్రాన వివక్ష వున్నట్లు కాదు. కానీ, బలమైన ప్రజాస్వామ్యానికి ఇదొక సూచన.ఃః
లా కమిషన్‌ ఏం చేయాలనే దానిపై స్పష్టమైన ప్రణాళిక లేకుండా, కేవలం అస్పష్టమైన పదాలతో జారీ చేసిన నోటీసు ద్వారా ఈ ప్రక్రియనంతటినీ మళ్లీ చేపట్టాల్సిన అవసరం వుందని తాము అనుకోవడం లేదని మెమోరాండం పేర్కొంది. పైగా, కేవలం నెల రోజుల పరిమిత కాలంలో అభిప్రాయాలు తెలియచేయాలని కోరడం ద్వారా, వివిధ సంస్థలు, లేదా ఈ అంశంపై పనిచేసే వివిధ వ్యక్తుల నుండి అభిప్రాయాలు కోరడానికి సీరియస్‌గా ప్రయత్నం జరగడం లేదని, కేవలం లాంఛన ప్రాయంగా చేస్తున్నారని తాము అభిప్రాయపడుత్నుట్లు ఐద్వా నేతలు పేర్కొన్నారు. వివిధ బిజెపి పాలిత రాష్ట్రాలు, ప్రధాని ఇటీవల యుసిసికి అనుకూలంగా మాట్లాడినందున యూసీసీ కావాలని ఏదో ఒక రకంగా సిపార్సు చేయా లన్నది లా కమిషన్‌ ఎజెండాగా వున్నట్లు కనిపిస్తోంది. వివిధ మతపరమైన సంస్థలను తమ అభిప్రాయాలు తెలియ చేయాలంటూ ప్రత్యేకంగా లా కమిషన్‌ కోరడం విస్మయానికి గురి చేసిందన్నారు. మహిళల హక్కులు, సమానత్వానికి సంబంధించిన అంశం యుసిసి, అటువంటపుడు ఈ అంశాలపై పనిచేస్తున్న వారందరికీ, అలాగే ఆయా కమ్యూ నిటీల్లోని మహిళలకు లా కమిషన్‌ ప్రాధాన్యత నివ్వాలి. అందువల్ల, యూసీసీ తీసుకురావడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ అంశాన్ని పున:పరిశీలించే ప్రస్తుత ప్రక్రియ అన్నది అనేక మహిళా సంఘాలు, గ్రూపులు, మైనారిటీ కమ్యూనిటీల ఆకాంక్షలకు పూర్తి విరుద్ధంగా వుంది. ఉత్తరాఖండ్‌ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు చురుకు గా ఈ ఎజెండాను అనుసరిస్తున్నాయన్నది స్పష్టమైంది. ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలన్న తమ ఉద్దేశ్యాన్ని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి బహిరంగంగానే ప్రకటించారు కూడా.
మహిళల సమానత్వ హక్కులకు సంబంధించి నంతవరకు ప్రస్తుత ప్రభుత్వానికి చెడ్డ రికార్డు వుంది. లింగ న్యాయానికి ఎన్నడూ ఈ ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వలేదు. లేదా మహిళల కోసం ఒక్క సంస్కరణను కూడా తీసుకురాలేదు. హిందూ పర్సనల్‌ లాల్లో కొన్ని సంస్కరణలు తీసుకురావాలంటూ అనేక డిమాండ్లు వచ్చినా ఈ చట్టాలను మార్చడానికి, ఈ మహిళలకు సమాన చట్టాలు తీసుకురావడానికి ప్రభుత్వం ఒక్క చర్య కూడా తీసుకోలేదు.
కేవలం ప్రస్తుతమున్న ముస్లిం లాని, రాజ్యాంగంలో ఆరవ షెడ్యూల కిందకు వచ్చే గిరిజన ప్రాంతాలకు సంబంధించిన చట్టాలను లేకుండా చేయడానికి చేసే ప్రయత్నమే ఈ యుసిని అని బలంగా అభిప్రాయపడుతు న్నట్లు ఐద్వా నేతలు ఆ మెమోరాండంలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య నిబంధనలను దృష్టిలోవుంచుకుని, ఆయా కమ్యూనిటీలతో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాత మాత్రమే ఇది జరగాలి.
హిజాబ్‌ను ధరించే ముస్లిం యువతులను ఎలా లక్ష్యంగా చేసుకుంటున్నారో, దానివల్ల వారి ప్రాధమిక హక్కు అయిన విద్య ఎలా దెబ్బతిందో మనం చూశాం. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళల హక్కులను కాపాడకుండా కేంద్రం ప్రభుత్వం మతపరమైన ఉద్దేశ్యాలతో కేవలం ముస్లిం పురుషులను జైల్లో వేసేందుకు చట్టం తీసుకువచ్చింది. ఈ చర్యను సుప్రీం కోర్టు ఇప్పటికే కొట్టివేసింది. హిందూ మహిళలతో వారి సమ్మతి మేరకు సంబంధాలు కొనసాగించే ముస్లిం యువకులను లక్ష్యంగా చేసుకుని బూటకపు లవ్‌ జిహాద్‌ కేసుల్లో వారిని జైళ్ళకు పంపింది.
తమ పిల్లలపై సమాన సంరక్షక హక్కులు లేకపోవడం వల్ల మన దేశంలో హిందూ మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అత్తింటివారి ఆస్తులపై కూడా వారికి సమాన హక్కులు వుండడం లేదు. వివాహ సమయంలో భార్యాభర్తల్లో ఎవరో ఒకరు, లేదా ఇద్దరు కలిసి సమకూర్చుకున్న ఆస్తే అయినా వాటిపై హక్కు వుండడం లేదు. ఇటీవలే, మద్రాసు హైకోర్టు ఒక కేసులో తీర్పు వెలువరిస్తూ, మహిళలు ఇంట్లో చేసే పనికి కూడా విలువుంటుందని స్పష్టం చేసింది. అందువల్ల ఆమె భర్త సంపాదించిన ఆస్తిలో ఆమెకు కూడా సమాన వాటా వుంటుందని పేర్కొంది. ఆ ఆస్తి ఏర్పాటులో ఆమె ఆర్థికంగా సాయపడినా లేకపోయినా దానిపై హక్కు వుంటుందని తీర్పు చెప్పింది. అయితే, దీనికోసం అనేక మహిళా సంఘాలు, గ్రూపులు అడుగుతున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు.
కుల దురంహంకారం పేరుతో జరిగే నేరాలు, హత్యలను ఎదుర్కొనేందుకు సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని ఐద్వా సహా అనేక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇటువంటి నేరాలకు పాల్పడే కుటుంబ సభ్యులను, అలాగే తమకిష్టమైన వారిని వివాహం చేసుకునే లేదా ఎంచుకునే హక్కును తిరస్కరించే, యువ దంపతులను వేధించే, హింసించే కుల పంచాయితీలను శిక్షించేందుకు ఈ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇటువంటి చట్టం కోసం 2005లోనే ఐద్వా ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుత ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ దిశగా ఏమీ జరగలేదు.
అలాగే, యూపీ, ఉత్తరాఖండ్‌ సహా కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ భూముపై హిందూ మహిళలకు, ఇతర మహిళలకు సమాన హక్కులు వుండడం లేదు. ఈ రెండు రాష్ట్రాల్లో ఇటువంటి ఆస్తులపై వారసత్వం నుంచి వివాహమైన కుమార్తెలను మినహాయిస్తున్నారు. హెచ్‌ఎస్‌ఎ పరిధి నుంచి వ్యవసాయభూమిని తొలగిస్తున్న మినహాయింపును రద్దు చేయడానికి 2005లొ హిందూ వారసత్వ చట్టాన్ని సవరించినప్పటికీ, కొన్ని రాష్ట్ర చట్టాల్లో వ్యవసాయ భూమి వారసత్వం కొనసాగుతోంది. ఈ రాష్ట్ర చట్టాలు ఈ వారసత్వపు హక్కును మహిళలు పొందకుండా అడ్డుకుంటున్నాయి. వాస్తవానికి, ఈ చట్టాలను రాజ్యాంగం లోని 9వ షెడ్యూల్‌లో పెట్టారు. కోర్టుల పరిధికి వాటిని వెలుపల వుంచాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. ఒకహిందూ మహిళ తన స్వంతంగా సంపాదించుకున్న ఆస్తికి, ఆమె భర్త, పిల్లలు లేనపుడు అమె కన్నా ఆమె భర్త వారసులకే హక్కు వుంటుందనే అన్యాయమైన నిబంధన హిందూ వారసత్వ చట్టంలో వుంది. దీన్ని కూడా సవరించలేదు. అలాగే, ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహం చేసుకోవాలంటే ముందుగా ఒక నెల నోటీసు ఇచ్చి ఆ కాలపరిమితి ముగిసిన తర్వాతనే వివాహం చేసుకోవాలనే నిబంధనను తొలగిస్తూ, ప్రత్యేక వివాహ చట్టాన్ని సవరించాలని కూడా సూచించినట్లు వారు ఆ మెమోరాండంలో పేర్కొన్నారు.
మహిళలకు సమానహక్కులు తీసుకురావడం కోసం ఐద్వాతో సహా పలు ఇతర మహిళా సంఘాలు అనేక సంవత్సరాలుగా కొన్ని సూచనలు చేస్తున్నాయి. అయితే, ఈ డిమాండ్లను గత, ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూనే వచ్చాయి. మరోవైపు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లవ్‌ జిహాద్‌ను లేవనెత్తుతూ, మతాంతర, కులాంతర వివాహాలు చేసుకోవడాన్ని నిలువరించేందుకు నిరంకుశమైన మత మార్పిడి చట్టాలు తీసుకువస్తున్నాయి. ఇప్పుడు ఏకరూపత కోసమంటూ ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలని కోరుతున్నాయి. కోలుకోలేని రీతిలో వివాహం విచ్ఛిన్నమైందన్న కారణంతో విడాకుల కోసం చట్టం తీసుకురావాలంటూ కూడా మాట్లాడుతున్నారు. అయితే, అత్తింటివారి ఆస్తిపై సమాన హక్కు లేనపుడు, సరైన భరణానికి సంబంధించిన చట్టలు లేనపుడు అనేకమంది మహిళల మనుగడ అనేది ప్రశ్నార్ధకమవుతుంది.
కుటుంబ చట్టాలు లేని రంగాల్లో బహుళ కుటుంబ చట్టాలు (ప్లూరల్‌ ఫ్యామిలీ లాస్‌), ఉమ్మడి చట్టాలు రెండు వున్న సుసంపన్నమైన సాంప్రదాయం భారత్‌కు వుంది. ఇంతకుముందే చెప్పినట్లుగా, వరకట్న నిరోధక చట్టం, సతి అమలు (నిరోధక) చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, గృహ హింస నుండి మహిళలను కాపాడే చట్టం ఇవన్నీ ఉమ్మడి చట్టాలు, అన్ని కమ్యూనిటీలకు వర్తిస్తాయి. అలాగే కుల దురంహకారం పేరుతో జరిగే హత్యలు, నేరాలను నిరోధించే చట్టం కూడా చేయాలి, అత్తింటివారి ఆస్తిపై సమాన హక్కు వుండేలా చట్టం తీసుకురావాలి. అదే సమయంలో, ఆయా కమ్యూనిటీల్లోని మహిళల, మహిళా ఉద్యమాల ప్రతినిధుల అభీష్టానుసారం పర్సనల్‌ చట్టాల్లో సంస్కరణలు తీసుకురావాలి.
లా కమిషన్‌తో విస్తృతంగా చర్చలు జరపాలి
యూసీసీని తీసుకురావాలని ప్రభుత్వం నిశ్చయించింది కాబట్టి కేవలం ఆ కారణంతోనే ఈ అంశాన్ని లా కమిషన్‌ పున:పరిశీలించవద్దంటూ ఐద్వా ఆ మెమోరాండంలో విజ్ఞప్తి చేసింది. ఈ రంగంలో తమకు వున్న అనుభవాన్ని దృష్టిలో వుంచుకుని, లా కమిషన్‌ పిలిచిన రోజు తాము కూడా వెళ్ళి మౌఖికంగా సాక్ష్యాధారాలు అందచేయాలనుకుంటున్నట్లు ఐద్వా నేతలు తెలిపారు. ఈ అంశంతో సంబంధముండే మహిళా సంఘాలు, ఇతర గ్రూపులు అన్నింటినీ పరిగణన లోకి తీసుకుని లా కమిషన్‌ వారితో కూడా విస్తృతంగా చర్చలు జరపాలని కోరారు. ముఖ్యంగా మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన మహిళలతో మాట్లాడాలని, అలాగే గిరిజన మహిళలతో మాట్లాడాలని ఆ తర్వాతనే యూసీసీ పై సిఫార్సు చేయడానికి నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.

Spread the love
Latest updates news (2024-07-04 15:06):

citrulline vs viagra most effective | men cbd oil testosterone | anastrozole for low testosterone YW7 | clinical online sale manifestations | rosolution gel wuj side effects | cb 1 weight QBR gainer walgreens | men sexual performance 1M6 pills | cholesterol free trial erectile dysfunction | best male sex pill j6h in gas stations | cbd vape slow mo ejaculation | uRv natural remedies for urinary retention | what stops a sIC man from ejaculating | cpt code for erectile dysfunction LYi | anxiety ills supplements | fda regulated male enhancement OwQ | exuberant nee male enhancement pills | last zwh loner in bed | alwayshard genuine | erection not TtD lasting long enough | OFj age 23 erectile dysfunction | ills that keep tEm you harder longer | how to buy antibiotics W4D online | how to raise sexual stamina 9yB | erectile dysfunction online shop rap | ayurvedic medicine for male qId erectile dysfunction | 6 pack pill genuine | dpE eddy for erectile dysfunction | anxiety tamsulosin generic | erectile wGL dysfunction purple pills | what is vascular erectile dysfunction cEH | male o8a enhancement pills on aazon | big sale climax sexualidad | prostate V9E enlargement and erectile dysfunction | cbd cream goodrx tadalafil | what does qIN zinc do for you sexually | reddit anxiety aex | erectile dysfunction for sale vaccine | drugs that make you last e9P longer in bed | hardknight 1n9 male enhancement free sample | erections WGL as hard as steel | can you cure erectile zIs dysfunction | natural for sale male enhancements | cialis official flaccid hang | viagra fail drug test Ygm | sex pill to Tax help libido after c section | my penis Lic is smaller | can vitamin 14s d cause erectile dysfunction | muscletech testosterone booster walmart review 5k4 | premature ejaculation erectile dysfunction treatment QyG | is peanut butter good for 2c5 erectile dysfunction