
గాంధారి మండలంలోని రాంపూర్ గడ్డ తండాకు చెందిన ఉదయ్ కిరణ్ రాష్ట్ర స్థాయి అండర్ 18.400 మీటర్ పరుగు పందెంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానం జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో బంగారు పథకం సాధించినట్లు ఆయన తెలిపారు. ఈనెల 25 నుండి హైదరబాద్ లో జరిగే పోటీల్లో కామారెడ్డి జిల్లాకూ ప్రాతినిధ్యం వహిస్తాడు , శ్రీ సాందీపని డిగ్రీ కళాశాల లో మొదటి సంవత్సరం చదువు కుంటున్నా ఉదయ్ బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఉదయ్ కిరణ్ ను ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు గుగ్లోత్ సురేందర్ గ్రామస్థులు అభినందించారు.