– సమగ్ర క్యాన్సర్ కేర్ సెంటర్ అత్యాధునిక సదుపాయాలతో క్యాన్సర్ రోగులకు నాణ్యమైన చికిత్సను అందించనుంది.
– 100 పడకల సామర్థ్యం కలిగిన ఈ క్యాన్సర్ కేంద్రం ‘రోగి-కేంద్రీకృత విధానం’తో పనిచేస్తుంది
నవతెలంగాన – నంద్యాల: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, ఉదయానంద హాస్పిటల్స్, తమ క్యాన్సర్ సెంటర్, ఉదయానంద – కార్కినోస్ క్యాన్సర్ సెంటర్‌ను కార్కినోస్ హెల్త్‌కేర్‌తో కలిసి ప్రారంభించింది. రోగులకు నాణ్యమైన, సమగ్రమైన ఆంకాలజీ కేర్ సేవలను అందించడానికి ఒక సహకార కార్యక్రమంగా ఇది నిలవటం తో పాటుగా నంద్యాల నివాసితులకు పూర్తి ఆరోగ్య సంరక్షణను అందుబాటులో తీసుకురానుంది. ఈ ఇరు సంస్థల ముఖ్య ప్రతినిధులతో పాటు, స్థానిక రాజకీయ ప్రముఖులు కూడా ఈ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయానంద- కార్కినోస్ క్యాన్సర్ సెంటర్ లో 100 పడకల సౌకర్యం కలిగి ఉండటం తో పాటుగా ఎలెక్టా హార్మొనీ మరియు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ప్రో లినాక్ మెషిన్ వంటి అధునాతన రేడియోథెరపీ పరికరాలను కలిగి ఉంది. ఈ క్యాన్సర్ సెంటర్ వైద్య, శస్త్రచికిత్స మరియు రేడియేషన్ ఆంకాలజీ విభాగాల్లో విస్తరించి ఉండటం తో పాటుగా పేషంట్ ఫస్ట్ విధానాన్ని ప్రోత్సహిస్తుంది మరియు ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. ఈ సందర్భంగా ఉదయానంద హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ ” కార్కినోస్‌తో కలిసి ఈ అర్థవంతమైన కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉంది. ఇది క్యాన్సర్‌కు సంబంధించి అధిక-నాణ్యత సేవలను అందించడం, రోగులకు శ్రద్ధ మరియు కరుణతో చికిత్స చేయడం లక్ష్యంగా పెట్టుకుంది..” అని అన్నారు. క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను గురించి కార్కినోస్ హెల్త్‌కేర్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ శ్రీమతి శ్రీప్రియా రావు మాట్లాడుతూ, “నంద్యాలలో క్యాన్సర్ సెంటర్ ఉండటం వల్ల స్థానికులకు రోగనిర్ధారణ మరియు చికిత్సను వేగవంతం చేసే అవకాశం అందిస్తుంది. ఈ భాగస్వామ్యంతో, మేము ప్రబలంగా ఉన్న నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCDలు) కోసం సకాలంలో నివారణ, నియంత్రణ మరియు స్క్రీనింగ్‌ను సులభతరం చేయడం ద్వారా కమ్యూనిటీ అవగాహనను సృష్టిస్తాము..” అని అన్నారు.