
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చండూరులో పనిచేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి ఉగాది పురస్కారం లభించింది. ఆదివారం రెడ్డిగర్జన సామాజిక సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బషీర్ బాగ్ లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఉపాధ్యాయ వృత్తి తో పాటు రచనా రంగంలో చేస్తున్న కృషి గాను ఈ ఉగాది పురస్కారం లభించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంకెనపల్లి సుధీర్ రెడ్డి, నావల్గ సత్యనారాయణ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే రంగారెడ్డి, సంతోష్ రెడ్డి, సుమతి, శ్రీలక్ష్మి, వసంత రెడ్డి, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, గర్జన పత్రిక ఎడిటర్ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.