
జిల్లా కేంద్రంలోనీ విశ్వ తేజస్ సంస్థ జిల్లాలోని వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులకు ఉగాది పురస్కారాలను బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు హాజరు అయ్యి ఉగాది పురస్కారాలు అందజేశారు. వారి సేవలను కొనియాడారు. కళా రంగంలో సేవలకు గాను ప్రముఖ కళాకారుడు, గాయకుడు, రచయిత, మిమిక్రీ కళాకారుడు, నృత్య దర్శకుడు, వ్యాఖ్యాత, కోకిల నాగరాజుకు ఈ సందర్భంగా ఉగాది పురస్కారాన్ని అందజేశారు. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో ఇందురు ఖ్యాతిని చాటిన నాగరాజు సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్వతేజ వ్యవస్థాపకులు తిరునగిరి శ్రీహరి,మెజీషియన్ రంగనాథ్ వివిధ రంగాల్లో ప్రముఖ స్థానం వహించిన అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోకిల కళాబృందం సభ్యులు అపర్ణ , శ్రీనిధి ప్రదర్శించిన నాట్యం ఎంతో ఆకట్టుకుంది.