
గట్టుపల మండల పరిధిలోని తేరట్పల్లీ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం ఉగాది పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల సాంస్కృతిక ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాం పాఠశాల విద్యార్థులకు ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి, తెలుగు సంవత్సరం, నెలలగురించి, తిధి, వార, నక్షత్రాల గురించి విపులంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనమని, కష్ట సుఖాలను సమాన రీతిలో చూడాలని, కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దని, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దని, జీవితం అంటే తీపి చెదుల కలయిక అనీ, అన్నింటిని తట్టుకొని జీవిత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఉగాది పచ్చడిని తయారు చేసి సేవించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సధాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు సాయిరాం, నరసింహ, మురుసు మల్లేశం, వెంకటేశ్వర్లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.