సుందరయ్య నగర్ లో ఘనంగా ఉగాది పండుగ 

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర సుందరయ్య నగర్ లో మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సుందరయ్య ఆర్చ్ ముందు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలు ముగ్గులు వేసి  ఉగాది శుభాకాంక్షలు ఒకరినొకరు తెలుపుకున్నారు. అదేవిధంగా సుందరయ్య నగర్ లోని తమ నూతన గృహాలలో శుభసూచకంగా మామిడి ఆకు తోరణాల  కట్టి షర్ట రుచులతో కూడిన ఉగాది పచ్చడి చేసి సుందరయ్య నగర వాసులకు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కమిటీ సభ్యులు, సోమ, మల్లారెడ్డి, అంబాల, మురళి, పల్లపు రాజు,మంచోజు, బ్రమ్మచారి, కొమ్ము, రాజు, ఊకే, ప్రభాకర్, ముల్కొజుశ్రీనివాస చారి, శ్రీరామోజు, సువర్ణ  తిప్పర్తి, సరళ మసిక, ఝాన్సీ మసిక, రజిత సుశీల,అనసూర్య,కళమ్మ. తదితరులు పాల్గొన్నారు.