షడ్రుచుల సమ్మేళనం ఉగాది

Shadruchula Compound Ugadiతెలుగు వారి కొత్త సంవత్సరం ‘ఉగాది’. ఈ పండుగ రోజు తినే పచ్చడికి ఎంతో ప్రత్యేకత ఉంది. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఉగాది పచ్చడి తింటే ఎంతో ఆరోగ్యం. తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు కలిపి ఉగాది పచ్చడిని చేస్తారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ షడ్రుచులు కలిపిన ఉగాది పచ్చడి తినాలని పెద్దలు చెబుతూ ఉంటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి ఇస్తుందంటారు. ఈ పచ్చడి తయారీ చూద్దాం…
అవసరమై పదార్ధాలు: మామిడికాయ (ఓ మాదిరి పరిమాణం కలది)- 1 వేప పువ్వు- 1/2 కప్పు సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు- 1/2 కప్పు కొత్త చింతపండు- 100 గ్రాములు కొత్త బెల్లం- 100 గ్రాములు పచ్చిమిరపకాయలు- 2 అరటిపండ్లు – 2 ఉప్పు  – సరిపడినంత మిరియాల పొడి – కొద్దిగా
తయారీ విధానం: ముందుగా వేపపువ్వును కాడల నుంచి వేరు చేసి పెట్టుకోవాలి. చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పది నిమిషాల తర్వాత దాని గుజ్జును వేరుచేయాలి. మామిడికాయను, పచ్చిమిరపకాయలు, కొబ్బరిని సన్నగా తరగాలి. అరటి పండ్లను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకొని దాన్ని చింతపండు గుజ్జులో కలపాలి. ఈ మిశ్రమంలో మామిడికాయ ముక్కలు, తరిగిన కొబ్బరి, పచ్చిమిరపకాయ ముక్కలను వేసి చివరిగా ఒక అర స్పూను ఉప్పు, మిరియాలపొడి వేసి కలుపుకోవాలి. అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి సిద్ధమైపోయినట్టే.