ఉగాండా ఉఫ్‌

ఉగాండా ఉఫ్‌ప్రొవిడెన్స్‌ : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-సిలో అఫ్గనిస్థాన్‌ అలవోక విజయం సాధించింది. ఉగాండాపై 125 పరుగుల తేడాతో గెలుపొందింది. రెహ్మనుల్లా గుర్బాజ్‌ (76), ఇబ్రహీం జద్రాన్‌ (70) అర్థ సెంచరీలతో అఫ్గనిస్థాన్‌ తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. ఛేదనలో ఉగాండా 16 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. పేసర్‌ ఫజల్‌ ఫరూకీ (5/9) ఐదు వికెట్లతో విజృంభించగా, స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (2/12), నవీన్‌ ఉల్‌ హాక్‌ (2/4) రెండేసి వికెట్లతో మెరిశారు.