హైదరాబాద్: సెప్టెంబర్ 30, 2024తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నేడు విడుదల చేసింది. ఈ ఫలితాల ప్రకారం మొత్తం డిపాజిట్లు సెప్టెంబర్’23/జూన్’24లో రూ. 29,139 కోట్లు / రూ. 32,514 కోట్ల నుండి సెప్టెంబర్’24కు రూ. 34,046 కోట్లకు చేరాయి. తద్వారా ఇయర్ ఆన్ ఇయర్(వైఓవై) 17% మరియు గత త్రైమాసికం తో పోలిస్తే ఈ త్రైమాసికం (క్యు ఆన్ క్యు) 5% వృద్ధి నమోదు అయింది. కాసా పుస్తకం ఇయర్ ఆన్ ఇయర్ 26% మరియు క్యు ఆన్ క్యు 6% వృద్ధి చెంది రూ. 8,882 కోట్లకు చేరుకుంది. గ్రాస్ లోన్ బుక్ ఇయర్ ఆన్ ఇయర్ 14%/, వృద్ధి చెంది రూ. 30,344 కోట్లకు చేరుకుంది. బ్యాంకు యొక్క కలెక్షన్ సామర్ధ్యం ఈ త్రైమాసికం లో 97 % గా ఉంటే జీఎన్ పిఏ లు 2.5 % గా వున్నాయి.