ఉక్రెయిన్ యుద్ధ విరమణకు ఆగస్టు 5,6 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డా నగరం వేదికగా శాంతి చర్చలు జరగనున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ అంతర్జాతీయ శాంతి చర్చలలో పాల్గొనటానికి ఇప్పటికే 30దేశాలను ఆహ్వానించటం జరిగింది. ఈ సమావేశంలో అమెరికా తరపున జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లీ వాన్ పాల్గొంటున్నాడు.యూరోపియన్ యూనియన్, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నాయి. ఈ సమావేశానికి రష్యాను ఆహ్వానించటంలేదనే విష యం గమనార్హం.
ఈ సమావేశంలో పాల్గొనేందుకు చైనాను ఒప్పించవచ్చనే ఆలోచనతో చైనాతో సత్సంబంధాలు కలిగిన సౌదీ అరేబియాను వేదికగా చేయటం జరిగిందని భావిస్తున్నారు. అయితే చైనా ఈ సమా వేశంలో ఎంతవరకు పాల్గొంటుదనే విషయం ఇంకా స్పంష్టం కాలేదు. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్ లో జూన్ చివరన జరిగిన సమావేశానికి కొనసాగిం పుగా ఈ సమావేశం జరుగుతుంది. వర్ధమాన దేశాల లో ప్రధానమైనవన్నీ ఉక్రెయిన్ యుద్ధంపైన తటస్థం గా ఉన్నందున వాటిని తమకు అనుకూలంగా మార్చుకు నేందుకు డెన్మార్క్‌లో సమావేశం నిర్వహించటం జరిగింది.
ఈ సంవత్సరం చివరికల్లా మరింత విస్తృతమైన అంతర్జాతీయ శాంతి సదస్సు ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని, సమస్య పరిష్కారా నికి అవసరమైన నియమాల రూపకల్పన జరుగు తుందని జెడ్డా శాంతి చర్చల నిర్వాహకులు భావిస్తు న్నారు. ఈ నియమాలు రష్యా, ఉక్రెయిన్ ల మధ్య జరగనున్నశాంతి చర్చలకు ప్రాతిపధిక అవుతాయని, అవి ఉక్రెయిన్ కు అనుకూలంగా ఉంటాయని జెడ్డా సమావేశం నిర్వాహకులలో క్రియాశీలంగావున్న దౌత్యవేత్తలు అంటున్నారు. ఉక్రెయిన్ యుద్ధ సమస్య ను పరిష్కరించేందుకు సౌదీ అరేబియాలో జరగ నున్న సమావేశంతోసహా చేసే ఎటువంటి ప్రయత్నా న్నయినా ఇరాన్ సమర్థిస్తుందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి నాస్సర్ కనానీ ఛాఫీ అన్నాడు.
జెడ్డాలో జరగనున్న శాంతి చర్చలు ప్రధానంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడీమీర్ జెలెన్ స్కీ ప్రతిపాదించిన 10 అంశాల చుట్టూ జరుగుతాయని భావిస్తున్నారు. ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాలనుంచి రష్యా వైదొలగాలని, నష్ట పరిహారం చెల్లించాలని, యుద్ధ నేరాల ట్రిబ్యునల్ విచారణకు లోబడాలని ఉక్రెయిన్ రష్యాను డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేవని, అవాస్తవికమైన అంచనాలతో కూడి వున్నా యని రష్యా పదేపదే తిరస్కరిస్తోంది.
ఈలోపు జెడ్డా సమావేశాన్ని, ఆ సమావేశంలో జరగనున్న చర్చలను పరిశీలించనున్నట్టు రష్యా ప్రకటించింది. ”ఈ సమావేశంలో ప్రతిపాదింపబడే లక్ష్యాలను, నిర్వాహకులు చేసే చర్చల సరళిని చూడ వలసివుంది.
యుద్ధానికి దారితీసిన సమస్యలకు శాంతియుత పరిష్కారాన్ని కనుగొనేందుకు చేసే ఎటువంటి చొరవనైనా రష్యా అభినందిస్తుంది” అని రష్యా అధికార ప్రతినిధి డిమిట్రీ పెష్కోవ్ అన్నాడు. ఉక్రెయిన్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేం దుకు చేసే ఎటువంటి ప్రతిపాదననైనా రష్యా పరి శీలిస్తుందని, అయితే ఉక్రెయిన్, అమెరికా, నాటో దేశాలు రష్యాతో చర్చించటానికి సుముఖంగా లేవని రష్యా అధ్యక్షుడు వ్లాడీమీర్ పుతిన్ స్పష్టం చేశాడు.