నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
స్థానిక సంస్థల పెండింగ్ బిల్లులను ఇప్పించాలని కోరుతూ రాష్ట్ర మాజీ జెడ్పిటిసిల ఫోరం ప్రధాన కార్యదర్శి ఉమన్న గారి మనోహర్ రెడ్డి సోమవారం రోజు మాజీ మంత్రి కేటీఆర్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల లోపు జిల్లా పరిషత్, మండల పరిషత్, సర్పంచుల పెండింగ్ బిల్లులను ఇప్పించేలా కృషి చేయాలని ఆయన కోరారు.