యూఎన్‌ ఉన్నత న్యాయస్థానం

– పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయిల్‌ ఆక్రమించటంపై
– అది అక్రమమం
దిహేగ్‌: పాలస్తీనా భూ భాగాన్ని ఇజ్రాయిల్‌ దశాబ్దాలుగా ఆక్రమిం చటం చట్టవిరుద్ధమనీ, వీలైనంత త్వరగా దీనికి ముగింపు పలకాలని ఐక్యరాజ్యసమితి ఉన్నత న్యాయస్థానం తెలిపింది. పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయిల్‌ ఉనికిని కొనసాగించటం చట్టవిరుద్ధమని కోర్టు గుర్తించిందని ఐసీజే అధ్యక్ష న్యాయమూర్తి నవాఫ్‌ సలామ్‌ అన్నారు. ఇజ్రాయిల్‌ ఆక్రమణను వీలైనంత త్వరగా ముగించాలన్నారు. ఇజ్రాయిల్‌ అన్ని కొత్త సెటిల్మెంట్‌ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలనీ, ఆక్రమిత భూమి నుంచి సెటిలర్లందరినీ ఖాళీ చేయాలని ఐసీజే వివరించింది. ఇజ్రాయిల్‌ విధానాలు, ఆచారాలను సైతం తప్పుబట్టింది. కాగా, అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయాన్ని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తోసిపుచ్చారు. ‘అబద్ధాల నిర్ణయం’ అని నిందించారు. తమ మాతృభూమిలోని అన్ని ప్రాంతాలలో ఇజ్రాయిల్‌ స్థిరనివాసాల చట్టబద్ధత వివాదాస్పదం కాదని వివరించారు.