రష్యా అణు విద్యుత్‌ ప్లాంట్‌ సమీపంలో ఉక్రెయిన్‌ దాడిపై ఐరాస స్పందన

రష్యా అణు విద్యుత్‌ ప్లాంట్‌ సమీపంలో ఉక్రెయిన్‌ దాడిపై ఐరాస స్పందనబ్యాకప్‌ జనరేటర్ల కోసం ఏర్పాటు చేసిన డీజిల్‌ ట్యాంకులకు సమీపంలో ఉక్రేనియన్‌ దళాలు బాంబులు వేస్తు న్నాయని రష్యా ఫెసిలిటీ సిబ్బంది ఆరోపించిన తర్వాత, జాపోరోజీ అణు విద్యుత్‌ ప్లాంట్‌లో భద్రతను కాపాడ వలసిన బాధ్యత అన్ని పక్షాలదేనని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ ప్రతి నిధి తెలిపారు. అణు విద్యుత్‌ ప్లాంట్‌ సమీపంలో ఇటీవల జరిగిన దాడి గురించి ఐక్య రాజ్య సమితి ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ను గురువారం విలేక రుల సమావేశంలో అడిగినప్పు డు ఆయన ఇలా చెప్పాడు. ”అణు విద్యుత్‌ ప్లాంట్‌ చుట్టూ ఉన్న పరిస్థితి గురించి చాలా ఆందో ళన చెందుతున్నామని మేము పదే పదే చెబుతున్నాము. దాని భద్రతను కాపాడటంపై హామీ ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ప్రమాదం అంటూ జరిగితే ఎటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతు ందనే విషయం గురించి ఆలోచించ డానికే భయమేస్తుంది” అని డుజారిక్‌ చెప్పాడు. ఐక్యరాజ్య సమితికి చెందిన న్యూక్లియర్‌ వాచ్‌డాగ్‌ అయిన ఇంటర్నే షనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ రష్యా మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటన గురించి తమకు తెలుసు నని పేర్కొంది. రేకులో చుట్టబడిన పేలుడు పదార్ధాలతో తయారు చేసిన బాంబును జాపోరోజీ అణు విద్యుత్‌ ప్లాంట్‌ కాంపౌండ్‌ గోడకు కేవలం ఐదు మీటర్ల దూరంలో పడవేసినట్లు ప్లాంట్‌ డైరెక్టర్‌ యూరీ చెర్నుక్‌ గురు వారం సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన ఒక వీడియోలో తెలిపాడు. ఈ దాడి వల్ల అణు విద్యుత్‌ ప్లాంట్‌కు ఎటువంటి నష్టం జరగలేదు. అలాగే ప్రాణనష్టం కూడా జరగలేదు. అయితే పొరపాటున ఇంధన ట్యాంకులు ధ్వంసం అయితే ప్లాంట్‌ ”అత్యవసర పరిస్థితుల సంసిద్ధత” దెబ్బతింటుం దని ఆయన చెప్పాడు.
2022లో ఉక్రెయిన్‌తో వివాదం ప్రారంభంలో యూరోప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్‌ ప్లాంట్‌ రష్యా నియంత్రణలోకి వచ్చింది. రష్యా నిర్వహించిన రిఫరెండం తరువాత జాపోరోజీ ప్రాంతం రష్యాలో విలీనం అయింది. ఆ తర్వాత ఇది అధికారికం గా రష్యా ఆటమిక్‌ విద్యుత్‌ సంస్థ రోసాటమ్‌ నిర్వహణకు బదిలీ చేయ బడింది. జాపోరోజీ అణు విద్యుత్‌ ప్లాంట్‌పై ఉక్రెయిన్‌ ఫిరంగి, క్షిపణి, డ్రోన్‌ దాడులను ప్రారంభించిందని, అలాగే దానిని స్వాధీనం చేసుకోవడా నికి ప్రత్యేక దళాలను అనేక సార్లు పంపిందని రష్యా పదేపదే ఆరోపిం చింది. జాపోరోజీ అణు విద్యుత్‌ ప్లాంట్‌ చాలా సార్లు బ్లాక్‌అవుట్‌లను ఎదుర్కోవటమే కాక దాని సహాయక మౌలిక సదుపాయాలకు స్వల్పంగా నష్టం వాటిల్లింది. జాపోరోజీ అణు విద్యుత్‌ ప్లాంట్‌కు పెను ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున, దాని పర్యవసానాల ప్రభావాన్ని తగ్గించడా నికి అణు విద్యుత్‌ ప్లాంట్‌ను నిద్రాణ స్థితిలో ఉంచటం జరిగింది.