నవతెలంగాణ – తొగుట
పెరిగి పోయిన అప్పులు తీర్చే మార్గం లేక మన స్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘ టనలు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. శుక్ర వారం ఎస్ఐ బి.లింగం తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన చింత కుమార్ (39) కూలి పని చేసుకుం టూ జీవనం సాగిస్తున్నాడు. పని ఉందని చెప్పి గురువారం రాత్రి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. ఉదయం తొగుట గ్రామ శివారులో చింత కుమార్ పురుగుల మందు తాగి మృతి చెంది ఉన్నాడని కుటుంబ సభ్యులకు తెలిసింది. విషయం తెలుసు కున్న భార్య చింత కవిత, కుటుంబ సభ్యులు కలి సి వెళ్లి చూసేసరికి తన భర్త కుమార్ పురుగుల మందు తాగి మృతి చెంది వున్నాడు. తన భర్త కుమార్ గత కొద్ది సంవత్సరాల క్రితం వరి కోత మిషన్, డీసీఎం బండ్లను అప్పుచేసి కొనుగోలు చేసి నట్లు తెలిపారు. వరి కోత మిషన్ (అర్వెస్ట్), డీసీఎం కొద్ది రోజులు నడిపించగా అవి సరిగ నడవక పోయేసరికి వాటి కోసం తెచ్చిన అప్పులు పెరిగి పోయాయని అన్నారు. అప్పులు పెరిగి పోవడంతో అప్పులు కట్టలేక వరి కోత మిషన్, డీసీఎం, తన ఇంటి స్థలాన్ని అమ్మగా వాటితో వచ్చిన డబ్బులతో కొంత వరకు అప్పులు కట్టి నాడని తెలిపింది. కట్టిన అప్పులు పోను రూ. రూ.30 లక్షలు మిగిలి ఉన్నాయని వాటిని ఎలా తీర్చాలి అంటూ తీవ్ర మనస్థాపానికి గురై గుర్తుతెలియని పురుగుల మందు తాగి మృతి చెందినట్లు చెప్పిం ది. మృతునికి కూతురు అక్షయ, కొడుకు అభిలాష్ లు ఉన్నారు. భార్య చింత కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు పరిచి పరిశోధన ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు.