అభివృద్ధిని చూసి ఓర్వలేక అక్కస్‌తో ఆరోపణలు

– డీసీసీబీచైర్మెన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి
నవతెలంగాణ-ఆలేరుటౌన్‌
అభివృద్ధి చేసి ఓర్వలేకనే అక్కసుతో బీఆర్‌ఎస్‌ పార్టీపై, ఎమ్మెల్యే గొంగిడి సునీత పై, అక్కసుతో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వాళ్లు ఆరోపణలు చేస్తున్నారని డీసీసీబీచైర్మెన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని లైట్‌ సైకిల్‌ మోటార్‌ అసోసియేషన్‌ నుండి, ఇతర యువకులు మహేందర్‌ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు సుదగాని, హరి శంకర్‌ గౌడ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ జుకంటి రవీందర్‌తో కలిసి మాట్లాడారు. ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డిని గెలిపించాలని, ఆలేరు అభివద్ధికి బాటలు వేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో ఏలుగలశివ, గాండ్లశ్రీకాంత్‌, పాండు, ఏలుగల మనోజ్‌,గాండ్ల లక్ష్మణ్‌, గాండ్ల శంకర్‌, గాండ్ల రాజు, గాండ్ల వెంకట్‌ సాయి, మడిశెట్టి హరీష్‌, ఏలుగల ఉదరు, ఏలుగల రమేష్‌,ఏలుగల శ్రీను, చింతపండు రాము, మంద. బాలయ్య, ఏలుగల. రామయ్య, పెద్ద ఎత్తున మహిళలు ఉన్నారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో ఆలేరు మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మెన్‌పోరెడ్డి.శ్రీనివాస్‌, గ్రంధాలయాల డైరెక్టర్‌, ఆడేపు. బాలస్వామి, ఆలేరు మునిసిపల్‌చైర్నెమ్‌ వస్పరి.శంకరయ్య, ్ట పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్‌ గౌడ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మెన్లు జూకంటి రవీందర్‌, జూకంటి శంకర్‌, వార్డు కౌన్సిలర్‌ లు ,తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న వలసలు
యాదగిరిగుట్ట: ఆలేరు నియోజకవర్గం బిఆర్‌ఎస్‌ లోకి కాంగ్రెస్‌ ,బిజెపి పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు భారీగా చేరుతున్నారు.శనివారం బొమ్మలరామారం,ఆత్మకూరు రాజపేట ,దుప్పెల్లి గ్రామాల నుండి ఇతర పార్టీల నాయకులు బిఆర్‌ఎస్‌ లో చేరగా వారికి డిసిసిబి చైర్మన్‌ గొంగిడి మహేందర్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.పార్టీలో చేరిన వారిలో బొమ్మలరామారం మండలం తిరుమలగిరి నుండి మాజీ సర్పంచ్‌ తెల్జురి నరసింహ వార్డు సభ్యులు తెల్జురి శ్రీను నాయకులు షానూర్‌ ,వినోద్‌ ఆత్మకూరు మండలం తుక్కాపూర్‌ నుండి సం గపాక బాల నరసయ్య,రవి ,రామచందర్‌ ,రాజపేట మండలం నెమలనుండి మోద బిక్షపతి ,భద్రయ్య ,పత్తి వెంకటయ్య దుప్పెల్లి నుండి పాల్సన్‌ సుభాష్‌ ,శివ మహేష్‌ పాల్గొన్నారు.