నవతెలంగాణ – బెజ్జంకి
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకు అమోదయోగ్యమైన బడ్జెట్ ప్రవేశపెట్టిందని మండల కాంగ్రెస్ శ్రేణులు దోనే వెంకటేశ్వర్ రావు, మానాల రవి, మెట్ట నాగారాజు, తిప్పారపు సురేశ్ శనివారం మండల కేంద్రంలో హర్షం వ్యక్తం చేశారు.అప్పుల కుపంలో మునిగిపోయిన రాష్ట్రాన్ని దాడిలో పెట్టె బాధ్యతతో పాటు అటు రాష్ట్రాభివృద్ధికి ఇటు ఆరు గ్యారెంటీలను అమలు చేసేల ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కర్షక, కార్మిక, పారిశ్రామిక, బడుగులకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత కల్పిస్తూ బడ్జెట్ రుపోందించడం అభినందనీయమని కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు.