రైతుల యొక్క స్థితిగతులను తెలుసుకొని ఎప్పటికప్పుడు అధిక వ్యవసాయ ఉత్పత్తులు పెంచే విధంగా నూతన ఆదర్శ రైతుల కమిటీ కృషి చేయాలని పీసీసీ ఆహ్వాన సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్ తెలిపారు. మంగళవారం బోనగిరి పట్టణ మండల నూతన ఆదర్శ రైతుల కమిటీని రైతులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదర్శ రైతులను తీసుకొని రైతులకు మేలు చేసే నిర్ణయాలను తీసుకున్నారని తెలిపారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆదర్శ రైతులను పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీ మేరకు నూతన కమిటీలు ఎంపిక జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి రైతులకు అనుసంధానంగా ఈ కమిటీలు పనిచేస్తాయని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీని శాలువాలతో సన్మానించారు. ఆదర్శ రైతుల నూతన కమిటీ అధ్యక్షుడిగా మొలుగు లక్ష్మయ్య, ఉపాధ్యక్షురాలుగా ఒంగేటి నవనీత, ప్రధాన కార్యదర్శిగా కొండ సంధ్య, కార్యదర్శిగా మచ్చ భాస్కర్, కోశాధికారిగా కంచి లలిత, కార్యదర్శిగా బీస సంధ్య, కార్యవర్గ సభ్యులుగా రాంపల్లి చంద్రం, బండారు పోశయ్య, జానకిరామ్, గోపగోని మహేష్, మాటూర్ కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.