మున్నూరు కాపు సంఘం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Unanimous election of Munnuru Kapu Sangam Committeeనవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. శుక్రవారం  ఆ గ్రామంలో మున్నూరు కాపు సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా సీపతి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా రాజ్ కుమార్, సురేష్, కోశాధికారిగా లింగమూర్తి, ప్రధాన కార్యదర్శిగా ఇమ్మడిశెట్టి సుధాకర్, ప్రచార కార్యదర్శిగా నీరటి రాజేందర్, కార్యదర్శి పురం శెట్టి బాపు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ మున్నూరు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు.