నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని పొన్కల్ పట్టణ నేతకాని సంక్షేమ సంఘం, కమిటీని ఆదివారం జన్నారం ప్రెస్ క్లబ్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా బట్టి లక్ష్మణ్, అధ్యక్షులుగా బట్టి( దుర్గం )వసంత్ కుమార్, ఉపాధ్యక్షులుగా జాడి రాజన్న, ప్రధాన కార్యదర్శిగా బట్టి రవీందర్,కోశాధికారిగా బట్టి శంకర్ సంయుక్త కార్యదర్శిగా బట్టి బానయ్య, ప్రచార కార్యదర్శిగా జాడి సురేందర్, కార్యవర్గ సభ్యులుగా నాగరాజ్ జాడి గంగన్న జాడి శ్రీనివాస్ దుర్గం లక్ష్మణ్, దుర్గం సత్యనారాయణ గౌరవ సలహాదారులుగా డాక్టర్ ఎస్ పెద్దన్న బట్టి రాజలింగం,లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నేతకాని సంఘం రాష్ట్ర నాయకులు, తాళ్లపల్లి రాజేశ్వర్ బోర్లకుంట ప్రభుదాస్, జన్నారం మండల అధ్యక్షుడు రత్నం లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జాడ్ వెంకట్, నాయకులు జాడి గంగన్న బండారి స్వామి జన్గురి మల్లేష్, దుర్గం అమృత రావు, బట్టి బానయ్య బట్టి వసంత్ దుర్గం నందయ్య దుర్గం వినోద్ అల్లూరి వినోద్, తదితరులు పాల్గొన్నారు.