తెలంగాణ గ్రామీణ వయోవృద్ధుల సంక్షేమ సంఘం కమిటీని మండల వయోవృద్ధులు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అద్యక్షులు లెక్కల మల్లయ్య, వ్యవస్థాపక అధ్యక్షులు సి.ఎచ్.భాస్కర్ రాజు, ట్రిబునల్ మెంబర్ అన్నె కాంతమణిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ప్పటికి వయోవృద్ధులకు సహకారం అందడంలేదన్నారు. తెలంగాణలో దాదాపుగా రూ.40 లక్షల వయోవృద్దులు వున్న, తెలంగాణ వయోవృద్దులుఈ రోజు చాలా మంది వయోవృద్దులు రక రకాల కారణముల వలన కుటుంబ సభ్యుల సహాకారం లేక పోషణకు మరియు వైద్య సేవల కొరకు ఇబ్బంది పడుచున్నారన్నారు. కొన్ని సందర్బాలలో వృద్దులను ఇంటి నుండి గెంటివేయబడుచున్నారన్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీరు మన రాష్ట్ర జనాభలో 10 శాతం వున్న వయోవృద్దులు తమ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుటకు వయొవృద్దులకు “ఆసరా పెన్షన్ “రు. 4016.00.రూ.లు.గా ప్రకటించాలన్నారు. మున్సిపాలిటీలు, మండలాల లో సీనియర్ సిటిజెన్స్ కు భవనములు ఏర్పాటు చేయాలన్నారు. వయోది కులకు టి.ఎస్.అర్.టి.సి బస్ ఛార్జీలపై 50% రాయితీ కలిపించాలన్నారు..వృద్దులకు అన్నిరకాల జబ్బులకు ప్రభుత్వ, ప్రభుత్వ గ్రాంటు పొందుచున్న ప్రైవేటు ఆ సుపతృల్లో ఉచిత సేవలు అందించాలనియు అంతిమదశలో వున్న తమను ఆదుకోవాలని కోరుతున్నామన్నారు కార్యక్రమంలో మండల వైద్యులు పాల్గొన్నారు.