భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమైక్య (లియాఫి) పాలకవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్ లో సర్వసభ్య సమావేశం, పాలకవర్గ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలిండియా జనరల్ సెక్రెటరీ బి ఎన్ శ్రీనివాస్ చారి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… జీవిత బీమా లో భవిష్యత్తులో వచ్చే మార్పులు, వాటికి అనుగుణంగా బీమా ఏజెంట్లు అవగాహన కలిగి ఉండాలని, ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి లియాఫీ. అనునిత్యం కృషి చేస్తుందని అన్నారు. నూతన అధ్యక్షునిగా కదం నారాయణరావు, జనరల్ సెక్రెటరీగా ప్రదీప్ కుమార్ జైన్, కోశాధికారిగా ఆకుల ఉమాపతి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ కిషోర్ చంద్, సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షులు రామస్వామి, డివిజన్ నాయకులు సునీల్ కుమార్, మోహన్, బ్రాంచ్ మాజీ అధ్యక్షులు కొండ బైరయ్య, అంజన్ కుమార్, క్లియర్ అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.