వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ

– జిల్లా బీసీ అభివద్ధి అధికారి బీరం సుబ్బారెడ్డి
నవతెలంగాణ- వనపర్తి
ప్రభుత్వ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా వసతి గహ సంక్షేమ అధికారులు కషి చేయాలని జిల్లా బీసీ అభివద్ధి అధికారి బీరం సుబ్బారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరం ప్రభుత్వ బీసీ బాలుర కళాశాల వసతి గహాన్ని ఆయన మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభమైనందున విద్యార్థులకు సమయానికి భోజనం అందించి సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకునేలా చూడాలని విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు దగ్గరగా ఉండి పర్యవేక్షించాలి అన్నారు వసతి గహ సంక్షేమ అధికారి సూచించారు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున ఈ సంవత్సరం ప్రభుత్వ వసతి గహాలలో చదువుతున్న విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు చదువులు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారు కూడా ఉత్తీర్ణులు అయ్యే విధంగా చూడాలని అన్నారు అనంతరం వసతి గహం ఆవరణ పరిసర ప్రాంతాలు, వంటగది పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు విద్యార్థులకు వండిన అల్పాహారం పరిశీలించి స్వయంగా విద్యార్థులకు వడ్డించారు అనంతరం విద్యార్థులతో పాటే అయిన కూడా అక్కడే అల్పాహారాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ అత్యంత కీలకమని వార్షిక పరీక్షలు ప్రారంభమైనందున విద్యార్థులు అన్ని విషయాలు పక్కన పెట్టి ఏకాగ్రతతో చదువు పై శ్రద్ధ పెడితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు అని అన్నారు పరీక్షలు అనగానే విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదని పరీక్షలు రాసే విధానంపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు విద్యార్థులు అబ్దుల్‌ కలాం గారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆయన అన్నారు కలలు కనండి కలలను సహకారం చేసుకోండని విద్యార్థులకు సూచించారు ఒక చదువుతోనే ఏ ఉన్నత ఉద్యోగమైనా ఏ రంగంలో అయినా మనం ఏదైనా సాధించవచ్చు అని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత పేద ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వసతి గహ సంక్షేమ అధికారి ఎస్‌. ఆంజనేయులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.