నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రం మద్ది విజయ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినట్లు ఐసిడిఎస్ ఏ సిడిపిఓ ఇందిరమ్మ తెలిపారు. మండల కేంద్రంలోని అంగడి సెంటర్ 3 లో సోమవారం రికార్డులను పరిశీలించి నాణ్యమైన ఆహారం ఎలా పంపిణీ చేస్తున్నారు. కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాణ్యమైన పప్పులు నూనెలు గుడ్లు బాలామృతం తదితరవి ప్రభుత్వం అందిస్తున్నారని తెలిపారు. దీనిని ప్రతి ఒక్క అంగన్వాడి టీచర్ సద్వినియోగం చేసుకొని అంగన్వాడి సెంటర్ కి వచ్చి ప్రతి పిల్లవాడికి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు అందించాల్సి నటువంటివి కరెక్ట్ గా అందించాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా ఉండేటట్లగా చూసుకోవాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే నాణ్యమైన ఫుడ్ కు సంబంధించిన సన్న బియ్యం గ్రుడ్డు నూనె అప్పులు అందించడం పట్ల హర్ష ప్రకటిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగమణి మల్లీశ్వరి సెంటర్ టీచర్ మద్ది విజయ పాల్గొన్నారు.