– అయోమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి కరుదయనీయంగా మారింది. పార్టీ అధిష్టానం హుస్నాబాద్ నియోజకవర్గం అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. గడిచిన గత రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ గణ విజయ సాధించగా ఈసారైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కార్యకర్తలు ఉంటే అధిష్టానం మాత్రం ఇప్పటివరకు టికెట్ ఖరారు చేయకపోవడం పై అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. 2009 నుంచి 14 వరకు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో హుస్నాబాద్‌లో అనేక అభివద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కాలేదు గత రెండు నెలలుగా సస్పెన్షన్ విడకపోవడంతో ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఇద్దరిలో ఎవరితో ప్రచారంలో తిరగాలి ఏ కార్యక్రమంలో పాల్గొనాలని అర్థం కాక కార్యకర్తలు తల పట్టుకుంటున్నారు. ఆరు నెలల నుండి అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డికే టికెట్ వస్తుందని నియోజకవర్గంలో అన్ని మండలాలలో 60 గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. మధ్యలో హుస్నాబాద్ నుండి పోటీ చేస్తానంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రావడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. పొన్నం ప్రభాకర్ కూడా హుస్నాబాద్ నియోజకవర్గంలో విస్తతంగా పర్యటిస్తున్నారు. తనకే టికెట్ వస్తుందని ధీమాతో పాత క్యాడర్‌తో కలుసుకుంటూ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి టిక్కెట్ వస్తుందో తెలియక ప్రచారంలో వెనుకంజ వేస్తున్నారు. ప్రవీణ్ రెడ్డి వేరే పార్టీ మారుతున్నారని ప్రచారం సాగుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బుజ్జగిస్తుందని సమాచారం అందింది. బీసీ కార్డుపై పొన్నం ప్రభాకర్‌కు వస్తుందా.. మాజీ ఎమ్మెల్యే కాబట్టి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి వస్తుందా అని నియోజకవర్గంలో చర్చ జోరుగా సాగుతుంది.