– అటవీ సంరక్షణ చట్టంపై సుప్రీంలో పిటిషన్
– సమాధానమివ్వాలంటూ కేంద్రానికి నోటీసులు
న్యూఢిల్లీ: అటవీ సంరక్షణ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ పలువురు మాజీ సీనియర్ అధికారులు, అటవీ పరిరక్షణy ేత్తలు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమైన దిగా ప్రకటించాలని వారు అభ్యర్థిం చారు. రాజ్యాంగం కల్పించిన అనేక ప్రాథమిక హక్కులను ఈ చట్టంఉల్లం ఘిస్తోందని తెలి పారు. రిట్ పిటిషన్‌పై ఆరు వారాల్లో సమాధానమివ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిం ది. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ మార్చి 27 లోక్‌సభలో సవరణ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలి సిందే. దీనిపై శాస్త్రవేత్తలు, ప్రభుత్వ మాజీ అధికారులు, పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సవరణ చట్టంలో అనేక లొసుగులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. బిల్లును పరిశీలించిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ తమ ఆందోళనలను పరిగణనలోకి తీసుకోలేదని, రాజ్యసభలో ఆగస్ట్ 2వ తేదీన జరిగిన చర్చలో సైతం ఇవి ప్రస్తావనకు రాలేదని తెలిపారు. బిల్లుకు లోక్‌సభ జూలై 26న, రాజ్యసభ ఆగస్ట్ 2న ఆమోదం తెలిపాయి. ఆగస్ట్ 4న దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నెల 20న విచారణ జరిపింది. పిటిషన్ దాఖలు చేసిన వారిలో పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు మాజీ కార్యదర్శులు ఎంకే రంజిత్ సింగ్, మీనా గుప్తా, వన్యప్రాణుల జాతీయ బోర్డు మాజీ సభ్యుడు ప్రేరణా సింగ్ బింద్రా ఉన్నారు.