అడ్డూ అదుపు లేకుండా అక్రమ మట్టి తవ్వకాలు

– ప్రభుత్వ ఖజానాకు గండి
– వేలాది రూపాయల మట్టిని అక్రమంగా తరలిస్తున్న మట్టి మాఫియా
– అనుమతి లేకుండా చెరువులో బావి తీసి మట్టిని తరలిస్తున్న వైనం
– నాయినవాని కుంట గ్రామంలో యాదేచ్చగా చెరువు మట్టి తరలింవు
– మీడియా వారిని బెదిరిస్తున్న మట్టి మాఫియా
నవతెలంగాణ – పెద్దవూర
ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ కోట్లాది రూపాయల మట్టిని అక్రమంగా మట్టి మాఫియా తరలిస్తున్న మామూళ్ల మత్తులో అధికారులు చర్యలు తీసుకోవడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా, కొండంత తవ్వకాలు జరుపుతున్నా, చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ప్రజాప్రతినిధుల తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. పెద్దవూర మండల పరిధిలోని నాయిన వాని కుంట గ్రామ చెరువు నుండి గత ఐదు రోజులుగా చెరువు మట్టినితరలిస్తున్నారు. చెరువులో మట్టిని తీసుకోవాలన్న, బావి తీయాలన్న సంబదిత అధికారుల అనుమతి తీసుకోవాల్సి వున్నా ఎలాంటి అనుమతులు లేకున్నా బావితవ్వు తున్నారు. తవ్వగా తీసిన మట్టిని చుట్టూ పక్కల గ్రామాలకు దాదాపు 10 ట్రాక్టర్ల తో ఒక్కో ట్రిప్పు
దురాన్ని బట్టి 400నుంచి 500 లవరకు కు అమ్ముతున్నారు. ప్రింట్ మీడియా చెరువు దగ్గరికి వెళ్లి పోటీలు తీసి వారిని అడుగగా మాపొలాలు ఎండి పోతున్నాయి. అందుకే చెరువులో బావి తవ్వి జేసిబి ఖర్చుల కోసం మట్టిని అమ్ముతున్నామని ఖరాఖాండిగా మీరు మీడియా అయితే మాకేంది మేము అలాగనె తవ్వుతాం ఏమిచేసుకుంటారో చేసుకోరి అని మీడియా వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు.
– మీడియా వారిని బెదిరిస్తున్న మట్టి మాఫియా: ఈ విషయం తెలుసు కొని తహసీల్దార్ గురువారం మధ్యాహ్నం మట్టి తోలకాన్ని ఆపి వేసింది.అధికారులు మట్టి తరలింవు అడ్డుకున్న తరువాత   అక్కడి వచ్చి అడిగి ఫొటోలు తీసిన నవతెలంగాణ జర్నలిస్ట్ వల్లే మట్టి తోలకం అపారని ఫోన్ లో శుక్రవారం సాయత్రం ఫోన్ చేసి బెదిరింపులకు గురు చేశారు.శుక్రవారం ఉదయం నుంచి మళ్ళీ బావి తీస్తు మట్టిని తోలుకుంటున్నాము.నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో అని నాయిన వాని కుంటకు చెందిన ఓ వ్యక్తి  మాప్రభుత్వం మీరేమి చేయలేరని బెదిరింపులకు ఏమి చేసుకుంటావో చేసుకో అని బెదిరింపులకు గురు చేశారు.  ఇదే అదునుగా చేసుకొని కొందరు వ్యవసాయ పొలంలో చెరువు మట్టిని పోసుకుంటున్నట్లు సమాచారం.ఇన్నేళ్లుగా ఇంతగా బావులు తీసి మట్టిని తరలించడం ఎన్నడూ చూడలేదని చుట్టుపక్కల రైతులు చెప్పడం విశ్లేషం.
– ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి: ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు గురువారం మట్టి తోలాకాన్ని ఆపివేశారు. అయితే శుక్రవారం ఉదయం 8 గంటలనుంచి మళ్ళీ మట్టి తోలు తున్నారు.అయిన  ఇరిగేషన్ అధికారులు, ఉన్నతాధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. చర్యలు తీసుకోవలసిన మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బుధవారం మట్టి తరలింవు అపుచేయూగా మళ్ళీ శుక్రవారం మళ్ళీ తరలిస్తున్నారని ఏమైనా వారికి ఎంత  మామూలు ముట్టాయా అని చర్చించు కుంటున్నారు.ఇప్పటి కైనా చెరువు లో బావి తీసి ఆ మట్టి అక్రమ రవాణా పై ఉన్నతాధికారులు దృష్టి సారించి మట్టి మాఫియా ఆగడాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు కోరుతున్నారు. ఇలాగే చెరువు నుంచి మట్టి తరలిస్తే చెరువులో నీళ్లు నిలువ ఉండకుండా రైతులు బోర్లు ఎండిపోయి పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపి అనుమతి లేకుండా  చెరువు మట్టి అక్రమ తరలింపుకు అడ్డు కట్ట వేయాలని రైతులు కోరుతున్నారు.
– కఠిన చర్యలు తీసుకుంటాము: తహసీల్దార్ సరోజ పావని,పెద్దవూరగురువారం నాయినవాని కుంట చెరువులో కొందరు అనుమతి లేకుండా  మూడు రోజులుగా బావిని తవ్వుతూ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తుల ద్వారా తెలుసుకుని ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇవ్వగా చెరువు మట్టి తరలింవు ను అడ్డుకొని నిలిపి వేశారు. అయితే శుక్రవారం ఉదయం నుంచి మళ్ళీ మట్టిని ట్రాక్టర్ల ద్వారా తారలిస్తున్నట్లు తెలిసింది. పరిశీలించి అక్కడ వున్నా ట్రాటర్లు, జేసిబి షీల్ చేస్తాము. చట్టపరంగా చర్యలు తీసుకుంటాము.