మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో శుక్రవారం అండర్-17 బాల బాలికల వాలీబాల్ కమ్మర్ పల్లి జోనల్ స్థాయి ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. మండల విద్యాధికారి ఆంధ్రయ్య, ఇంచార్జి పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మినర్సయ్య, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ఫిజికల్ డైరెక్టర్ వేముల నాగభూషణం, రాజేశ్వర్ గౌడ్, శ్యామ్, మాధురి, సింధు, బాలు, అజయ్, రాజు, తదితరలు పాల్గొని టీమ్స్ సెలెక్షన్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ గ్రౌండ్ లో జరిగే జిల్లా స్థాయి టోర్నమెంట్ పాల్గొంటారని ఎంఈఓ ఆంధ్రయ్య తెలిపారు.